Honor X8: హానర్ కొత్త ఫోన్ వచ్చేసింది - ధర రూ.20 వేలలోపే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్8ను లాంచ్ చేసింది.
హానర్ కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్8 లాంచ్ అయింది. ఈ కొత్త హానర్ ఫోన్‌లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. దీని మందం కేవలం 0.74 సెంటీమీటర్లు కావడం విశేషం. 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే మూడు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
హానర్ ఎక్స్8 ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు యూఏఈలో మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఓషన్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, టైటానియం సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే దీని ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
హానర్ ఎక్స్8 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 4.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.9:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 22.5W హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా... దీని బరువు 177 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో షూటర్, డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?