Honor Magicbook X14: హానర్ ల్యాప్‌టాప్ వచ్చేస్తుంది - మనదేశంలో టీజ్ చేసిన కంపెనీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ల్యాప్‌టాప్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. అదే హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్14.
హానర్ తన కొత్త ల్యాప్‌టాప్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. అదే మ్యాజిక్‌బుక్ ఎక్స్14. దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీ ఇప్పటికే అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్ అయింది. అయితే ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం ఇంకా తెలియరాలేదు.
అమెజాన్ లిస్టింగ్‌లో ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు కూడా టీజ్ చేశారు. హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్14తో పాటు మ్యాజిక్‌బుక్ ఎక్స్15 ల్యాప్‌టాప్ కూడా గతేడాది చైనాలో లాంచ్ అయింది.
హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్14 ఫీచర్లు
అమెజాన్ లిస్టింగ్ ప్రకారం... ఈ హానర్ ల్యాప్‌టాప్ మెటల్ బాడీతో రానుంది. దీని మందం 1.59 సెంటీమీటర్లు గా ఉండనుంది. బరువు మాత్రం కేవలం 1.38 కేజీలు మాత్రమే. ఇందులో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. యాంటీ గ్లేర్ లేయర్ కూడా ఇందులో ఉంది. 180 డిగ్రీల ఫోల్డింగ్ హింజ్ కూడా ఇందులో అందించారు.
ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో బ్యాక్‌లిట్ కీబోర్డు ఉండనుంది. ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌ను కూడా ఇందులో అందించనున్నారు. దీంతోపాటు పాపప్ వెబ్ క్యాంను ఇందులో అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 13.2 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
ఇటీవలే హానర్ 60 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
దీని ధరను 2,199 యువాన్లుగా (సుమారు రూ.25,810) నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
View this post on Instagram