Google Wallet: ఇండియాలోనూ గూగుల్ వ్యాలెట్ యాప్ వచ్చేసింది, ఫీచర్స్ భలే ఉన్నాయే!
Google Wallet App: ఇప్పటి వరకూ విదేశాలకు పరిమితమైన గూగుల్ వ్యాలెట్ యాప్ ఇప్పుడు భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది.
Google Wallet App Details: గూగుల్ వ్యాలెట్ (Google Wallet) ఇప్పుడు ఇండియాలోని ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. మిగతా దేశాల్లోని యాప్‌తో పోల్చి చూస్తే భారత్‌లోని యాప్ కాస్త భిన్నంగా ఉంది. ఈ అప్లికేషన్‌లో మూవీ టికెట్స్‌తో పాటు ట్రావెల్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాస్‌లు తీసుకునే వెసులుబాటు ఉంది. వీటితో పాటు మరెన్నో ఫీచర్స్‌ని అందులో చేర్చింది గూగుల్. ఇవన్నీ ఇండియన్ యూజర్స్‌కి మాత్రమే స్పెషల్‌గా డిజైన్ చేశారు. Google Wallet వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం...ఈ వ్యాలెట్ చాలా సెక్యూర్డ్. మరో ఆసక్తికరమై విషయం ఏంటంటే...ఇండియాలోని టాప్ 20 బ్రాండ్స్‌తో టైఅప్ పెట్టుకుంది గూగుల్. అందులో ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎయిర్ ఇండియా, ఇండిగో, పీవీఆర్, ఐనాక్స్, మేక్ మై ట్రిప్ లాంటి కంపెనీల సర్వీస్‌లూ (Google Wallet Features) ఉన్నాయి. ఈ యాప్‌ని వినియోగించుకోవాలనుకునే వాళ్లు సింపుల్‌గా ప్లే స్టోర్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే...ఈ యాప్‌లో ప్రస్తుతానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ సేవ్ చేసుకునే ఫీచర్ మాత్రం అందుబాటులో లేదు.
గూగుల్ వ్యాలెట్‌లో ఏమేం ఉన్నాయంటే..?
సినిమా టికెట్స్: పీవీఆర్‌లో కానీ ఐనాక్స్‌లో కానీ మీరో సినిమా టికెట్ బుక్ చేశారనుకుందాం. వెంటనే ఆ ఇ-టికెట్‌ని గూగుల్ వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
మెట్రో టికెట్స్: మెట్రోలో ప్రయాణించే వాళ్లు రకరకాల డిజిటల్ వ్యాలెట్స్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఒక్కోసారి సర్వర్స్ బిజీగా ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే గూగుల్ వ్యాలెట్ కూడా ఈ మెట్రో టికెట్స్ సర్వీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో, కొచ్చి మెట్రోతో పాటు అభిబస్ టికెట్స్ కూడా బుక్ చేసుకునేందుకు వీలవుతుంది.
బోర్డింగ్ పాస్‌లు: ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోతోనూ టై అప్ అయింది గూగుల్. ఈ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లను ఈ వ్యాలెట్‌లోనే తీసుకోవచ్చు. ఈ పాస్‌లను వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్స్: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు ఒక్కోసారి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. డోమినోస్, ఫ్లిప్‌కార్ట్, షాపర్స్‌స్టాప్‌తో గూగుల్ టై అప్ అయింది. ఈ కంపెనీలకు సంబంధించిన రివార్డ్ పాయింట్స్‌ని రిట్రీవ్ చేసుకునే ఫీచర్ ఇందులో ఉంది. ఇక ఈ యాప్‌లోని Gmail ఆప్షన్‌ని ఆన్ చేసుకుంటే..మనకి మెయిల్‌కి వచ్చే ఇంపార్టెంట్ టికెట్స్, డాక్యుమెంట్స్ యాప్‌లో కనిపిస్తాయి. ప్రతిసారీ మెయిల్ ఓపెన్ చేసి చూడాల్సిన పని ఉండదు.
మరి గూగుల్ పే సంగతేంటి..?
గూగుల్ వ్యాలెట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ గూగుల్ పే మాత్రం కంటిన్యూ అవుతుంది. వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి వీలుండదు. అందుకే Google Pay అలాగే ఉంటుంది. ఇప్పటికే ఈ డిజిటల్ వ్యాలెట్‌కి అందరూ అలవాటు పడిపోయారు. సర్వీస్‌లన్నీ డిజిటలైజ్ అవుతున్నందున భారతీయులకు ఆ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గూగుల్ వ్యాలెట్‌ని తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. గూగుల్ పే యథావిధిగా సేవలు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
Also Read: ముడతలున్న డ్రెస్‌తోనే ఆఫీస్‌కి రండి, ఐరన్ చేసుకోవద్దు - ఉద్యోగులకు వింత కండీషన్ పెట్టిన కంపెనీ