By: ABP Desam | Published : 06 Jan 2022 08:17 AM (IST)|Updated : 06 Jan 2022 02:39 PM (IST)
xiaomi
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షామీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఆ సంస్థ కస్టమ్స్ పన్నును ఎగవేస్తోందన్న ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. షామీ రూ. 653 కోట్లు ఎగవేసినట్టు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు దర్యాప్తు స్టార్ట్ చేశారు. షామీ, దాని కాంట్రాక్ట్ తయారీదారులపై విచారణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో భాగంగా రూల్స్ ప్రకారం క్వాల్‌కామ యూఎస్‌ఏ, బీజింగ్ షామీ మొబైల్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు షామీ ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజులు రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించారు అధికారులు.
భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో మొబైల్స్ విక్రయిస్తున్న షామీ.. ఇక్కడి నుంచే విదేశాలకు కూడా ఫోన్లు ఎగుమతి చేస్తోంది. విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని కొన్నింటిని అసెంబుల్డ్ చేస్తుంది. ఈ ప్రక్రియలో విలువ తగ్గించి పన్నులను ఎగువేస్తుందని గుర్తించారు అధికారులు. అందుకే విచారణ చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
విచారణ పూర్తైన తర్వాత షామీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు మూడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు డీఆర్‌ఐ అధికారులు. 2017 ఏప్రిల్ నుంచి 2020జూన్ మధ్య ఎగవేసిన 653 కోట్ల రూపాయల పన్ను చెల్లించాలని ఆదేశించింది.
కీలకమైన షామీ ఇండియా ప్రతినిధుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తయారీదారుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. పేమెంట్స్ చేసినట్టు ఓ షామీ అధికారి ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. షామీ ప్రాంగణాల్లో సోదాలు చేసిన డీఆర్‌ఐ.... కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది.
Koo App
Also Read: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Vivo Y01: రూ.9 వేలలోపే వివో స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!
Google Translate: గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎనిమిది కొత్త భారతీయ భాషలు - ఆ ప్రాచీన భాష కూడా!
Apple iPhone: యాపిల్ ఫోన్లలో మారనున్న చార్జింగ్ పోర్టు - యూరోపియన్ యూనియన్ ప్రెజరే కారణమా?
Infinix Note 12i: రూ.13 వేలలోనే ఆండ్రాయిడ్ 12, 50 మెగాపిక్సెల్ కెమెరా - సూపర్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !