News
News
X

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ట్యాబ్లెట్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో ట్యాబ్ జీ62.

FOLLOW US: 

మోటొరోలా మోటో ట్యాబ్ జీ62 మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఏకంగా 10.61 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఈ ట్యాబ్లెట్‌లో ఉంది.

మోటో ట్యాబ్ జీ62 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వైఫై ఓన్లీ వేరియంట్ ధర రూ.15,999 కాగా, ఎల్టీఈ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఫ్రాస్ట్ బ్లూ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ52 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఆగస్టు 22వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.

మోటో ట్యాబ్ జీ62 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పనిచేయనుంది. ఇది 4జీని సపోర్ట్ చేయనుంది. సింగిల్ నానో సిమ్ కార్డు స్లాట్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 10.61 అంగుళాల 2కే+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఇందులో ఉంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఐపీ52 రేటింగ్ కూడా ఇందులో ఉండనుంది.

ఇందులో ముందువైపు, వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది. డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, టైమ్ ల్యాప్స్, ఫేస్ బ్యూటీ, వీడియో స్నాప్‌షాట్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

నాలుగు స్పీకర్ల సెటప్ ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే... బ్లూటూత్ వీ5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై,  యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 7700 ఎంఏహెచ్ కాగా, 20W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 465 గ్రాములుగా ఉంది.

ఇటీవలే మోటొరోలా జీ62 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. ఆగస్టు 19వ తేదీ నుంచి దీని సేల్ మనదేశంలో ప్రారంభం కానుంది.

ఈ మొబైల్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 20W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 17 Aug 2022 05:44 PM (IST) Tags: Motorola Moto Tab G62 Price in India Moto Tab G62 Moto Tab G62 Launched Moto New Tab

సంబంధిత కథనాలు

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

Amazon Great Indian Festival Sale Goes Live: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్ట్ సేల్ ప్రారంభం - యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై టాప్ డీల్స్!

Amazon Great Indian Festival Sale Goes Live: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్ట్ సేల్ ప్రారంభం - యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై టాప్ డీల్స్!

Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ప్రైమ్ మెంబర్స్‌కు మరిన్ని ఆఫర్లు!

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ప్రైమ్ మెంబర్స్‌కు మరిన్ని ఆఫర్లు!

Nokia T10: నోకియా టీ10 ధర లీక్ - రూ.12 వేలలోపే బడ్జెట్ ట్యాబ్!

Nokia T10: నోకియా టీ10 ధర లీక్ - రూ.12 వేలలోపే బడ్జెట్ ట్యాబ్!

టాప్ స్టోరీస్

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి