Android phone Bluetooth Mouse: ల్యాప్‌టాప్‌కు మౌస్ లేక ఇబ్బంది పడుతున్నారా - ఫోనే మౌస్‌గా మార్చుకోవచ్చు!
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌నే మౌస్‌గా మార్చే యాప్స్ ఇవే.
ల్యాప్‌టాప్‌ల్లో ఉపయోగించేవారికి ఒక్కోసారి మౌస్ అవసరం అవుతుంది. ఎక్కువగా అవసరం లేకుండా అప్పుడప్పుడు కావాలనుకునేవారికి మౌస్ కొనాలనిపించదు. కానీ ఆ టైంలో మౌస్ లేకుంటే పని జరగదు. ఇలాంటి సందర్భాల్లో మీ దగ్గరున్న ఆండ్రాయిడ్ ఫోన్‌నే మౌస్‌గా మార్చుకోవచ్చు. కేవలం ఒక్క యాప్‌తో ఇది సాధ్యం అవుతుంది. విండోస్ ల్యాప్‌టాప్‌లు, క్రోమ్‌బుక్స్, మాక్స్‌కు కూడా ఈ యాప్ ద్వారా మీ ఫోన్‌ను మౌస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు.
మీరు ఉపయోగించే ల్యాప్‌టాప్ సరిగ్గా పనిచేయకపోయినా ఇది మీకు సహాయపడుతుంది. కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు ట్యాబ్లెట్‌ను కూడా మౌస్‌గా మార్చుకోవచ్చు. అయితే దీనికి మీ ల్యాప్‌టాప్ వైఫై ద్వారా కానీ, బ్లూటూత్ ద్వారా కానీ మీ ఫోన్‌కు కనెక్ట్ అయి ఉండాలి.
మీ ఫోన్‌ను వైర్‌లెస్ మౌస్‌గా మార్చే కొన్ని యాప్స్ ఇవే.
మోనెక్ట్ పీసీ రిమోట్ (ఫ్రీ యాప్)
ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌లకు బ్లూటూత్ లేదా వైఫై ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఉండే యాక్సెలరోమీటర్ లేదా గైరోస్కోప్‌ల ద్వారా గేమింగ్ కంట్రోల్స్ కూడా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా పీసీ స్క్రీన్‌ను మీ ఫోన్‌పై ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
యూనిఫైడ్ రిమోట్ (ఫ్రీ యాప్)
యూనిఫైడ్ రిమోట్ కూడా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ పీసీ, లైనక్స్, మ్యాక్‌లకు దీని ద్వారా మీ ఫోన్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. సర్వర్ డిటెక్షన్, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
రిమోట్ మౌస్ (ఫ్రీ యాప్)
పీసీ, డెస్క్‌టాప్, వైఫైలకు దీని ద్వారా స్మార్ట్ ఫోన్ సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. కేవలం వైఫై కనెక్టివిటీ మాత్రమే ఇందులో ఉంది. జూమ్, స్క్రోల్, డ్రాగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెబ్ రిమోట్, యాప్ స్విచర్, మీడియా రిమోట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram