Blue Tiger Solare: ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌కు అస్సలు చార్జింగ్ పెట్టక్కర్లేదు.. అదిరిపోయే టెక్నాలజీ!
ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ పవర్ హెడ్‌సెట్ లాంచ్ అయింది.

కమ్యూనికేషన్ హెడ్ సెట్లను అందించే బ్లూటూత్ కంపెనీ బ్లూ టైగర్ యూఎస్ఏ అనే కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ హెడ్ సెట్‌ను ప్రకటించింది. దీని పేరు బ్లూ టైగర్ సోలారే హెచ్‌సెట్‌గా నిర్ణయించారు. ఇవి సీఈఎస్ 2022లో లాంచ్ కానున్నాయి. జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు లాస్ వెగాస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
బ్లూ టైగర్ సోలారే హెడ్‌సెట్ ధర
దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. షిప్పింగ్ మాత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కంపెనీ వెబ్ సైట్లో దీని ధరను 199.99 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.15 వేల వరకు ఉండనుందన్న మాట.
బ్లూ టైగర్ సోలారే ఫీచర్లు
కంపెనీ తెలుపుతున్న ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ పవర్డ్ కమ్యూనికేషన్ హెడ్ సెట్ ఇదే. ఇంట్లో, ఆఫీస్‌లో వీటిని ఉపయోగించవచ్చు. ఇండోర్, అవుట్‌డోర్ ఎక్కడనుంచైనా ఇది కాంతిని తీసుకుని పని చేస్తూనే ఉంటుంది. మీరు బ్యాటరీని రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. -40 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి 122 డిగ్రీల ఫారన్ హీట్ టెంపరేచర్ మధ్య ఇది పనిచేయనుంది.
ఈ మిలటరీ గ్రేడ్ బ్లూటూత్ హెడ్ సెట్ ఉపయోగించే సోలార్ టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రత్యేకమైన నానో మెటీరియల్ ద్వారా ఈ టెక్నాలజీని రూపొందించారు. దీనిద్వారా ఇండోర్‌లో అయినా... అవుట్ డోర్‌లో అయినా.. సాధారణ కాంతిని అయినా.. కృత్రిమ కాంతిని అయినా.. ఇది శక్తిగా మార్చి బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది.
ఇందులో 97 శాతం నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది. హై క్వాలిటీ స్పీకర్ కాంపోనెంట్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది అనే విషయం ఆలోచించకుండా ఉపయోగించేందుకు ఇది సాయపడుతుంది.
ఈ సోలార్ సెల్ టెక్నాలజీ వేర్వేరు కోణాల నుంచి కాంతిని తీసుకోగలదు. ఇండోర్, అవుట్‌డోర్ లైట్ నుంచి ఇది సమానంగా పనిచేస్తుంది. సిరి, గూగుల్ అసిస్టెంట్‌లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో ఈ హెడ్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?






















