అన్వేషించండి

Privacy Invasive Apps: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంత డేటాను కలెక్ట్ చేస్తున్నాయో తెలుసా? - షాకిచ్చే వివరాలు!

Instagram: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ ఎక్కువ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

Most Privacy Invasive Apps: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్/ట్విట్టర్ అనేవి చాలా మంది వ్యక్తుల ఫోన్‌లలో కనిపించే నాలుగు ప్రధాన యాప్స్. ఇవి కాకుండా మరికొన్ని ప్రధాన యాప్‌లు ఉన్నాయి కానీ ఈ యాప్స్‌ను భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ దాదాపుగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కువ డేటాను సేకరించే యాప్స్ గురించి ఒక నివేదిక బయటకు వచ్చింది. సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకారం మెటాకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ వినియోగదారుల నుంచి అత్యధిక డేటాను తస్కరించే రెండు యాప్‌లు. కంపెనీ ఈ డేటాను తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటుంది.

మొత్తంగా 100 యాప్స్
సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తన పరిశోధనలో 100 ప్రముఖ యాప్‌లను చేర్చింది. వీటిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండు యాప్స్ మాత్రమే అత్యధిక డేటాను సేకరిస్తున్నట్లు కనుగొనబడింది. మెటా సంస్థకు చెందిన ఈ యాప్స్‌ను 'మోస్ట్ ఇన్వేసివ్ యాప్స్' కేటగిరీలో ఉంచడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా వివిధ పరిశోధనా సంస్థలు ఇదే విషయాన్ని చెప్పాయి. ఇన్వేసివ్ యాప్స్ అంటే వినియోగదారుల డేటాను ఎక్కువగా సేకరించే యాప్స్.

యాపిల్ ప్రైవసీ పాలసీలో భాగమైన 32 ప్రమాణాల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ యాప్‌లకు ర్యాంక్ ఇచ్చింది. పేమెంట్ ఇన్ఫర్మేషన్, లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ ఇలా... ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెటా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన సర్వీసులు కాబట్టి ఈ రెండు యాప్స్ ఒకే విధంగా డేటాను సేకరించి స్టోర్ చేసుకోవడంలో ఆశ్చర్యం లేదని పరిశోధకులు తెలిపారు. ఈ రెండు యాప్‌లు యాపిల్ డిఫైన్ చేసిన మొత్తం 32 డేటా పాయింట్లను సేకరిస్తాయి. అలా చేసే యాప్‌లు ఈ రెండు మాత్రమే మాత్రమే అని ఈ ఏజెన్సీ పేర్కొంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాపిల్‌కు సంబంధించిన ఏడు డేటా పాయింట్లను ఉపయోగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడానికి వినియోగదారుల పేరు, ఫోన్ నంబర్, చిరునామాను ఉపయోగిస్తాయని నివేదిక పేర్కొంది. ఐడెంటిటీ కోసం కంపెనీ ఇతర డేటా పాయింట్లను కూడా ఉపయోగిస్తుంది. ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్/ట్విట్టర్ తక్కువ డేటాను సేకరిస్తుంది. థర్డ్ పార్టీ ప్రకటనదారులతో చాలా తక్కువ సమాచారాన్ని షేర్ చేస్తుందని సర్ఫ్‌షార్క్ పరిశోధన వెల్లడించింది. ఎక్స్/ట్విట్టర్ ట్రాకింగ్ కోసం సుమారు 22 డేటా పాయింట్లలో సగం కంటే తక్కువను ఉపయోగిస్తుంది.

మరోవైపు వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల జాబితాలో కూడా ఈ ఫోన్ జాయిన్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందు‌లో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABPCM Jagan on AP Roads | ఏపీలో రోడ్ల దుస్థితిపై మాట్లాడిన సీఎం జగన్ | ABP DesamCM Jagan on Three Capitals | పరిపాలనా రాజధానిగా విశాఖ సీఎం జగన్ మరోసారి క్లారిటీ | ABP DesamCM Jagan on TDP Super Six | టీడీపీ సూపర్ సిక్స్ అమలు కాని పని అంటున్న సీఎం జగన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
IPL 2024: ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
Embed widget