X

Huawei Earbuds: పేరుకే ఇయర్ బడ్స్.. కానీ ఏం పనులు చేస్తుందో ఊహించలేరు…

చైనీస్ టెక్ బ్రాండ్ దిగ్గజం హువావే తన ఇయర్‌బడ్స్ తాజా వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాని ఫీచర్స్ ఏంటి...ఇప్పటి వరకూ మర్కెట్లో ఉన్న ఇయర్ బడ్స్ కి వీటికి వ్యత్యాసం ఏంటి...

FOLLOW US: 

అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే డిజైన్‌, ఫీచర్స్‌తో సరికొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ల దాకా నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా హువావే ఫ్రీ బడ్స్‌ ప్రో వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌‌ని మార్కెట్లోకి విడుదల చేసింది.

చైనీస్ టెక్ బ్రాండ్ దిగ్గజం హువావే తన ఇయర్‌బడ్స్ తాజా వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్,  ఐఓఎస్‌తో సహా మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది. FreeBuds 4 హయ్యెస్ట్ రిజల్యూషన్ సౌండ్స్ అందించేందుకు లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్ మిశ్రమ డయాఫ్రాగమ్‌ను ఉపయోగిస్తుంది. మరింత ఆకట్టుకునే సౌండ్స్‌ని  అందించేందుకు సహాయపడే 14.3mm డైనమిక్ డ్రైవర్‌ని కలిగి ఉంటుంది.

ఇయర్‌బడ్‌లు దాని అడాప్టివ్ ఇయర్ మ్యాచింగ్ (AEM) ఫీచర్ ద్వారా ఉపయోగించేవారి చెవి ఆకారానికి పెట్టుకునే పద్ధతికి తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. ఈ ఇయర్ బడ్స్‌ని ఎలా పెట్టుకున్నా ఆడియో క్వాలిటీ తగ్గకుండా ఆప్టిమైజ్ చేసుకునేలా తయారు చేశారు. హై-సెన్సిటివిటీ మైక్రోఫోన్ 48 kHz వరకు శాంపిల్ రేట్‌కి సపోర్ట్ చేసే హై-ఫిడిలిటీ సౌండ్‌ని రికార్డ్ చేయగలదు. Huawei AI లైఫ్ యాప్‌ని ఉపయోగించడం వల్ల వినడమే కాదు... చుట్టుపక్కల ఎలాంటి సౌండ్స్ ఉన్నప్పటికీ, మన వాయిస్ ని గుర్తించగల టెక్నాలజీ ఈ ఇయర్ బడ్స్ సొంతం. అలాగే 'వాయిస్ మోడ్' రికార్డ్ చేయవచ్చు.  అదే సమయంలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది.

ఫ్రీబడ్స్ 4 నాయిస్ క్యాన్సిలేషన్  మెరుగుపరచడంలో సహాయపడే డ్యూయల్-మైక్రోఫోన్ హైబ్రిడ్ డెనోయిజింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఇయర్‌బడ్‌లు 25 dB వరకు శబ్దాన్ని రద్దు చేయడానికి ఇది అనుమతిస్తుంది. సరైన నాయిస్ క్యాన్సిలేషన్ పొందేందుకు హువాయే చాలా పరిమితులతో రూపొందించింది. వినియోగదారు ఎప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ని ఆన్ చేస్తారో...అప్పుడు ఆటో మేటిగ్గా అనేక డేటా సెట్‌లు నాయిస్ క్యాన్సిలేషన్ చేసి.... ఆటోమేటిగ్గా ఉన్నత ఆడియోను ఇయర్‌బడ్‌ల ద్వారా అందించేందుకు AEM సపోర్ట్ చేస్తుంది.

ఫస్ట్-పర్సన్ షూటింగ్ గేమ్స్ (ఎఫ్‌పిఎస్) ఆడటానికి ఇష్టపడే యూజర్లు ఫ్రీబడ్స్ 4 ను కూడా ఎంజాయ్ చేస్తారు. దాని తక్కువ లేటెన్సీ మోడ్‌ వినియోగదారులను ఆకట్టుకంటుంది. గేమ్‌లో 150 ఎంఎస్ ఆలస్యం సాధించే కొత్త గేమ్ ఆడియో కోడింగ్‌ని ఉపయోగిస్తుంది. 90 ఎంఎస్‌ల వరకు తక్కువగా ఉంటుంది, షూటింగ్ యాక్షన్ మరియు సౌండ్‌ను కలిసి అందిస్తోంది. ఈ ఉత్పత్తులు సెరామిక్ వైట్ మరియు సిల్వర్ ఫ్రాస్ట్‌తో సహా రెండు రంగులలో UAEలో లభిస్తుంది.

హువావే కొత్తగా లాంఛ్ చేసిన ఇయర్‌బడ్స్ ప్రీ-ఆర్డర్స్ ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి కొనుగోల చేసేవారికి కొన్ని బహుమతులు ఉంటాయి. కంపెనీ లాస్ కేర్ ఫ్రీబడ్స్ సర్వీస్‌కు ఒక సంవత్సరం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.

Tags: Chinese tech brand Huawei Launches latest version of its earbuds

సంబంధిత కథనాలు

Samsung F23 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ప్రాసెసర్ వివరాలు లీక్!

Samsung F23 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ప్రాసెసర్ వివరాలు లీక్!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Oppo Reno 7 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. మొదటిసారి ఆ కెమెరాలతో.. ధర ఎంతంటే?

Oppo Reno 7 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. మొదటిసారి ఆ కెమెరాలతో.. ధర ఎంతంటే?

Samsung Price Cut: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు.. భారీ ఆఫర్!

Samsung Price Cut: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు.. భారీ ఆఫర్!

Redmi Note 11S: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర రూ.20 వేలలోపే?

Redmi Note 11S: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర రూ.20 వేలలోపే?

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే ఛాన్స్ 

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే ఛాన్స్ 

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !