Grok AI: ఎలాన్ మస్క్ AI చాట్‌బాట్‌పై టర్కీలో నిషేధం! ఎర్డోగాన్ వివాదం.. అసలు కారణం ఇదేనా?
Grok AI : టర్కీ కోర్టు ఎలాన్ మస్క్ X అభివృద్ధి చేసిన Grok AI చాట్‌బాట్‌పై నిషేధం విధించింది. అధ్యక్షుడు గురించిన ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని ఈ చర్యలు తీసుకుంది.

Grok AI : ఎలాన్ మస్క్ కంపెనీ X(గతంలో ట్విట్టర్)అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్ Grokపై టర్కీ కోర్టు నిషేధం విధించింది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పై అభ్యంతరకరమైన, అవమానకరమైన సమాచారం ఇచ్చినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని అంకారా ప్రధాన ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. దీనిపై అధికారిక దర్యాప్తు కూడా ప్రారంభించింది. టర్కీలో ఇలాంటి AI టూల్‌పై నిషేధం విధించడం ఇదే మొదటిసారి.
వివిధ మీడియా సంస్థలు అందిస్తున్న సమాచారం ప్రకారం, వినియోగదారులు కొన్ని ప్రత్యేక ప్రశ్నలను టర్కిష్ భాషలో అడిగినప్పుడు, Grok ఎర్డోగాన్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను చూపించింది. దీని తరువాత, సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ అథారిటీ (BTK) కోర్టు ఆదేశాల మేరకు Grokపై నిషేధం విధించింది. టర్కీ చట్టం ప్రకారం, అధ్యక్షుడిని అవమానించడం నేరం, దీనికి నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
AI చాట్‌బాట్‌లకు సంబంధించి పక్షపాతం, ద్వేషపూరిత భాష, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి సమస్యలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా OpenAIకి చెందిన ChatGPT 2022లో ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి సమాచారం వస్తోంది. Grok గతంలో యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందని, అడాల్ఫ్ హిట్లర్‌ను పొగిడినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయంలో ఎక్స్ (X) లేదా ఎలాన్ మస్క్ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే, గత నెలలో మస్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, Grokని త్వరలో అప్‌డేట్ చేస్తామని, ఎందుకంటే ప్రస్తుత మోడల్ "ధృవీకరించని డేటా ఆధారంగా చాలా పనికిరాని సమాచారంతో" నిండి ఉందని చెప్పారు.
టర్కీలోని చట్టాలన్ని తరచుగా ప్రశ్నించే వారిని అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు అంటున్నారు, అయితే ఈ చట్టం అధ్యక్ష పదవి గౌరవాన్ని కాపాడటానికి అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది.





















