అన్వేషించండి

ChatGPT New Rules: చాట్‌జీపీటీ ఇకపై ఆ విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వదు.. చాట్‌జీపీటీ కొత్త రూల్

ChatGPT Latest Update | చాట్జీపీటీ ఇకపై కేవలం విద్యా సాధనంగా మాత్రమే ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం న్యాయపరమైన, వైద్యం, ఆర్థిక సలహాలు ఇవ్వడం ఆపివేసిందని ప్రకటనలో తెలిపారు.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చట్టపరమైన విషయాల గురించి అయినా, బంధుత్వాల గురించి అయినా, ప్రతి సమస్యకు సంబంధించిన సలహా కోసం కొందరు ChatGPTని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ AI చాట్‌బాట్‌లో తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు OpenAI చాట్‌జీపీటీ (ChatGPT)లో వైద్య, ఆర్థిక, చట్టపరమైన సమస్యలకు సంబంధించిన సలహాలు ఇవ్వడం ఆపివేసినట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం అక్టోబర్ 29 నుండి ChatGPT వైద్య పరమైన, చట్టపరమైన విషయాలు, డబ్బుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసింది. ఇప్పుడు ఈ చాట్‌బాట్ కన్సల్టెంట్ కాకుండా కేవలం విద్యా సాధనంగా మాత్రమే మారింది.

ఇప్పుడు ఏం మారుతుంది?

కొత్త నిబంధనల ప్రకారం ChatGPT వినియోగదారులు మందుల పేర్లు, వాటి మోతాదు, దావా టెంప్లేట్‌లు, చట్టపరమైన వ్యూహాలు,  పెట్టుబడులకు సంబంధించిన సలహాలను పొందలేరు. ఇది సాధారణ రూల్స్, ప్రాథమిక విధానాల గురించి సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది.  డాక్టర్లు, న్యాయవాదులు, ఆర్థిక సలహాదారులు వంటి నిపుణులను సంప్రదించమని ప్రజలకు సలహా ఇస్తుంది. 

ఈ మార్పు ఎందుకు చేస్తున్నారు?

గత కొంతకాలంగా ChatGPT నుండి వచ్చిన సలహాలను అనుసరించి ప్రజలు తమకు తాము ప్రాణహాని చేసుకున్న అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టులో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 60 ఏళ్ల వృద్ధుడు ChatGPT సలహా మేరకు ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ తిన్నాడు. దాంతో అతనికి మానసిక సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మరొక కేసులో, అమెరికాకు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి ఆహారం నమిలి మింగడంలో సమస్యలు ఎదురయ్యాయి. అతను ChatGPTని దీని గురించి అడగ్గా క్యాన్సర్ కారణంగా ఇది జరగిందని చాట్‌బాట్ చెప్పింది. ఆ వ్యక్తి దీనితో సంతృప్తి చెందాడు. సమయానికి డాక్టర్‌ను సంప్రదించలేదు. తరువాత క్యాన్సర్ నాల్గవ దశకు చేరుకున్న తరువాతే ఆ వ్యక్తి డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Super Soft Idlis : ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget