News
News
X

BSNL Free Data: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. 5 జీబీ డేటా ఫ్రీ.. వేరే నెట్‌వర్క్‌లకు కూడా!

బీఎస్ఎన్ఎల్ ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ అయ్యే వినియోగదారులకు 5 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది.

FOLLOW US: 

కేంద్ర ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారేవారికి 5 జీబీ డేటా ఉచితంగా అందించనున్నారు.

ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. జనవరి 15వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని బీఎస్ఎన్ఎల్ ఈ ట్వీట్‌లో పేర్కొంది. ఉచితంగా అందించే 5 జీబీ డేటాకు 30 రోజులు లేదా ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ అందించనున్నారు.

ఈ 5 జీబీ డేటా లాభాలు అందుకోవడానికి వినియోగదారులు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా బీఎస్ఎస్ఎల్‌కు మారాల్సి ఉంటుంది. దీంతోపాటు తాము ఎందుకు నెట్‌వర్క్ మారుతున్నారో తెలపాల్సి ఉంటుంది. వినియోగదారులు #SwitchToBSNL అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ఈ విషయాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో షేర్ చేయాలి.

ఒకసారి దాన్ని షేర్ చేశాక.. వినియోగదారులు ఆ స్క్రీన్ షాట్లను ట్వీట్ చేయాలి లేదా తమ మొబైల్ నంబర్ నుంచి 9457086024కు వాట్సాప్ ద్వారా పంపాలి. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ నియమాల్లో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే తన రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను పెంచింది. 2022 జనవరి 15వ తేదీలోపు రీచార్జ్ చేసుకునే వారికి ఏకంగా 455 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఉచిత రింగ్ టోన్స్, ఎరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసులు కూడా పొందవచ్చు.

ఇంతకుముందు రూ.56, రూ.57, రూ.58 రీచార్జ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ సవరించింది. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ రూ.54 స్పెషల్ టారిఫ్ వోచర్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ధర గతంలో రూ.56గా ఉండేది. ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవడానికి 5,600 సెకన్ల టాక్ టైం అందించనున్నారు. దీనికి ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉంది.

దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ రూ.57 ఎస్టీవీని రూ.56కు తగ్గించారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 10 జీబీ డేటా, జింగ్ మ్యూజిక్ యాప్‌కు యాక్సెస్ అందించనున్నారు. దీని వ్యాలిడిటీ 10 రోజులుగా ఉంది.

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Jan 2022 03:53 PM (IST) Tags: BSNL 5GB Offer BSNL Free Data BSNL MNP Offer BSNL Mobile Network Offers

సంబంధిత కథనాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - చాట్ పక్కకు స్వైప్ చేస్తే!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - చాట్ పక్కకు స్వైప్ చేస్తే!

Samsung Galaxy A04 Core: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - కీలక వివరాలు లీక్!

Samsung Galaxy A04 Core: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - కీలక వివరాలు లీక్!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

Asus Zenfone 9: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!

Asus Zenfone 9: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!

టాప్ స్టోరీస్

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం