అన్వేషించండి

BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?

BSNL 84 Days Plan: ప్రముఖ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే రూ.599 ప్లాన్. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభించనుంది.

BSNL Rs 599 Plan: బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో తన వినియోగదారుల కోసం అనేక చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ టెలికాం సంస్థ ఈ రోజుల్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ట్రాయ్ తాజా నివేదిక ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో 3.5 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం 84 రోజుల చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌కు వినియోగదారులకు రోజుకు సగటున రూ.7 మాత్రమే ఖర్చు అవుతుంది.

బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ రూ. 599కి వస్తుంది. ఇందులో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత డేటా, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ప్రతిరోజూ 3 జీబీ డేటాను పొందుతారు. అంటే మొత్తంగా 252 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుందన్న మాట. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. స్పీడ్ తగ్గుతుంది కానీ నెట్ మాత్రం ఆగదన్న మాట.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో కూడా వస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఒక బండిల్ ప్లాన్. ఇది కాలింగ్, డేటా, మెసేజ్‌లతో పాటు కొన్ని వాల్యూ యాడెడ్ సర్వీసులను కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వినియోగదారులు ఈ ప్లాన్‌తో తమ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ప్లాన్‌తో మీ నంబర్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.345 ప్లాన్ కూడా లాంచ్...
రీసెంట్ గా కంపెనీ రూ.345 ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. దీని కింద యూజర్లకు 60 రోజుల వాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్ రోజువారీ తక్కువ డేటాను వాడుతూ కాలింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వినియోగదారుల కోసం. రూ.345 ప్లాన్ ద్వారా కంపెనీ ప్రతిరోజూ 1 జీబీ డేటాను అందిస్తోంది. వినియోగదారులు మొత్తంగా 60 జీబీ డేటా లాభాలను పొందుతారు. దీంతో పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు.  

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget