By: ABP Desam | Updated at : 18 Dec 2022 07:56 PM (IST)
బీఎస్ఎన్ఎల్ 5జీ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
BSNL 5G Launch Update: టెలికాం దిగ్గజాలు Airtel, Jio దేశంలోని అనేక పెద్ద నగరాల్లో తమ వినియోగదారుల కోసం 5G సేవను ప్రారంభించాయి. దీంతో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులు కూడా 5జీ సేవ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై మరోసారి అప్‌డేట్ ఇచ్చారు. వైష్ణవ్ ఒక కార్యక్రమంలో BSNL 5జీ సేవకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.
BSNL తన 5జీ నెట్‌వర్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుంది?
రానున్న 5 నుంచి 7 నెలల్లో BSNL తన 4జీ సర్వీస్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయనుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు దేశంలో ఉన్న 1.35 లక్షల టవర్లతో ఇది ప్రారంభమవుతుందని వైష్ణవ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ చాలా బాగుందని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ స్థానం ఇప్పుడు మరింత పటిష్టం కాబోతోందని అన్నారు.
టాటా సహకారంతో
బీఎస్ఎన్ఎస్ తన 5జీ సేవను ప్రారంభించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) తన సపోర్ట్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవను పరీక్షించడానికి టీసీఎస్ నుంచి ఎక్విప్‌మెంట్‌ను కూడా డిమాండ్ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ తర్వాతే కంపెనీ 5జీ ట్రయల్‌ను ప్రారంభించనుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రైవేట్ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ ఇంకా చేరుకోని చోట బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ మొదటిగా చేరుకుంటుంది.
ఇప్పటివరకు 5G నెట్‌వర్క్ ఎక్కడికి చేరుకుంది?
ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. అయితే, వీఐ (వోడాఫోన్ ఐడియా) ఇంకా దాని 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. దాని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించలేదు, అయితే త్వరలో కంపెనీ దేశంలో 4G, 5G నెట్‌వర్క్‌లను కూడా ప్రారంభించనుంది.
ఎయిర్‌టెల్, జియో 5జీని ఎక్కడ ప్రారంభించాయి?
జియో గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది, తద్వారా గుజరాత్ దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా 5జీ నెట్‌వర్క్ రాష్ట్రంగా అవతరించింది. ఇది కాకుండా జియో ట్రూ 5జీ సేవ ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణె, కోల్‌కతా, బనారస్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు నాథద్వారా (రాజస్థాన్) వంటి ప్రాంతాలకు కూడా చేరుకుంది. ఎయిర్‌టెల్ తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ, నాగ్‌పూర్, పానిపట్, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, గౌహతి, పాట్నా వంటి నగరాల్లో ప్రారంభించింది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
Netflix: పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!
Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!
WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక