అన్వేషించండి

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్​​ కొనాలా? రూ.10,000 లోపే అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న ఫోన్లు ఇవే

స్మార్ట్ ఫోన్​ కొనాలని  అనుకుంటున్నారా? అయితే మీ కోసమే  రూ.10 వేలలోపు రెడ్​మీ, ఐక్యూ, పోకో వంటి పాపులర్ బ్రాండ్లలో ఉన్న సూపర్ ఫీచర్స్ లోడెడ్​ టాప్​  స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​ గ్యాడ్జెట్స్​ చూసేయండి

బడ్జెట్ తక్కువ ఉండాలి ఫీచర్స్​ ఎక్కువగా ఉండాలి, తక్కువ ధరకే దొరకాలి స్టైలిష్​గా ఉండాలి.. అనే స్మార్ట్ ఫోన్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే రూ.10,000లోపు రెడ్​మీ, ఐక్యూ, పోకో వంటి పాపులర్ బ్రాండ్లలో ఉన్న సూపర్ ఫీచర్స్ లోడెడ్​ టాప్​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​ గ్యాడ్జెట్స్​ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇక్కడ చూసేయండి.

1) iQOO Z9 Lite 5G: ఐక్యూ జెడ్9 లైట్​ ఫీచర్స్ విషయానికొస్తే 6.56 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​,  6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్​సెట్​, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్​ల కోసం మాలి జీ57 MC2 GPU వంటివి ఉన్నాయి. 6 జీబీ వరకు LPDDR4x​  ర్యామ్, 128 జీబీ వరకు eMMC 5.1 స్టోరేజ్​ సోపర్ట్​తో​ నడుస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్​ను 1టీబీ వరకు ఎక్స్​పేండబుల్​ చేసుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఓఎస్ 14 ప్రాసెసర్​తో పనిచేస్తుంది.. అలానే  2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్​డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్​లు​ ఉంటాయి. ఈ జెడ్ 9 లైట్ 5జీలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్​ఫోన్  జాక్, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ ఉన్నాయి.

అలానే కెమెరా ముందు వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్, వెనక భాగంలో 2 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు  మెగా పిక్సెల్ షూటర్ కూడా ఉంది.

2) Poco M6 Pro  5G : 

పోకో ఎం6స్తే ప్రో 5జీ ఫీచర్ల విషయానికొస్తే  6.79 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఇంకా గొరిల్లా గ్లాస్ 3తో పాటు క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్​తో ఇది నడుస్తుంది.​ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయడంతో పాటు 2 మేజర్ ఓఎస్ అప్ డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్​డేట్స్​తో ఇది నడుస్తుంది.

అలానే ఈ స్మార్ట్ ఫోన్​ వెనకవైపు డ్యుయెల్ కెమెరా సెటప్​..  50 మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండగా, ముందువైపు  8 మెగా పిక్సెల్ కెమెరా డిస్​ప్లే టాప్​ సెంటర్​(పై భాగంలో) హోల్ పంచ్ కట్ అవుట్​లో ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బాగా ఉపయోగించుకోవచ్చు.

3) Moto G24 Power : 

మోటో జీ24 పవర్ ఫీచర్ల విషయానికొస్తే గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్​ల కోసం మాలి జీ-52 MP2 GPUతో పెయిర్(జత) చేసిన మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్​తో ఇది నడుస్తుంది.​ 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్​ను సపోర్ట్ చేస్తుంది.

6.56 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్ ఎల్​సీడీ డిస్​ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను​ కలిగి ఉంది. ఇంకా ఫ్రంట్​ సైడ్​ వైపు పంచ్ హోల్ నాచ్ డిజైన్​తో పాటు స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 52 సర్టిఫికేషన్​తో పని చేస్తుంది. 

ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే  వెనకవైపు డ్యూయెల్ కెమెరా.. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, మాక్రో షాట్స్ కోసం 2 మెగా పిక్సెల్ సెన్సార్​తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ సెన్సార్ కూడా దీని ప్రత్యేకత.

4) Realme C53: రియల్​ మీ సీ53 ఫీచర్ల విషయానికొస్తే 6.74 ఇంచ్​ 90 Hz డిస్​ప్లే, 90.3 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 560 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో వస్తోంది. అలానే  స్క్రీన్​కు 180 Hz టచ్ శాంప్లింగ్ రేటు కలిగి ఉంది.  ARM మాలి-జీ57 GPU, 12nm, 1.82GHz CPUతో ఆక్టాకోర్ చిప్​సెట్​తో నడుస్తుంది.

అలానే ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది. 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరాతో పాటు వీడియో రికార్డింగ్​ కోసం 1080P/30fps, 720P/30fps and 480P/30fps ప్రత్యేకతలు ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం  8 మెగా పిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 720P/30fps వీడియో రికార్డింగ్​ సపోర్ట్​తో పనిచేస్తుంది. అలానే వీడియో, బ్యూటీ మోడ్, హెచ్​డీఆర్​ పోర్ట్రెయిట్ మోడ్,  ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్, బోకే ఎఫెక్ట్ కంట్రోల్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం.

5) Redmi 13C : 

ఈ ఫోన్​ ఫీచర్ల విషయానికొస్తే  6.74 ఇంచ్​ హెచ్​డీ + డిస్​ప్లే 600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్​ కలిగి ఉంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కోసం మాలి-G57 MP2 GPUతో జత​ చేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జి 85 చిప్​సెట్​తో ఇది నడుస్తుంది.  8 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ వరకు UFS 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు ఎక్స్​ప్యాండబుల్ చేసుకోవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే  50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ లెన్స్​తో కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంది. అలానే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget