Best 5G Phones Under Rs 10000: రూ.10 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు - బడ్జెట్ రేట్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్!
Best 5G Mobiles Under Rs 10k: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న దీపావళి సేల్‌లో 5జీ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేలలోపు ధరలో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు ఏవో ఒకసారి చూద్దాం.
Flipkart Diwali Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీపావళి సేల్ కొనసాగుతోంది. అక్టోబర్ 21వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. దీపావళి సందర్భంగా భారతదేశంలో చాలా మంది కొత్త వస్తువులు కొనాలని కోరుకుంటారు. అందుకే కంపెనీలు ఈ పండుగ సమయంలో తమ ఉత్పత్తులపై ఆఫర్లను కూడా అందిస్తాయి. మీరు ఈ దీపావళి సేల్‌ని సద్వినియోగం చేసుకుని మీ కోసం మంచి ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మంచి ఆప్షన్లు కూడా ఉన్నాయి.
రూ.10 వేలలో మంచి 5జీ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే దీపావళి సేల్‌లో సాధారణంగా రూ.12-13 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌లు రూ. 10,000 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అలాంటి మూడు మంచి ఫోన్‌ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
పోకో ఎం6 5జీ (Poco M6 5G)
పోకో కంపెనీకి చెందిన ఈ ఫోన్‌ని మీరు కేవలం రూ. 7,199కే సేల్‌లో పొందవచ్చు. దీని అసలు ధర రూ.11,999. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సేల్‌లో రూ.7,999కి అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ రియర్ (వెనకవైపు) కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14 5G)
ఈ జాబితాలో రెండో ఫోన్ శాంసంగ్ కంపెనీకి చెందినది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న 5జీ ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 20,999 కాగా ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని రూ. 10,999కి విక్రయిస్తున్నారు. ఇది కాకుండా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ.9,499కి అందుబాటులోకి రానుంది. ఇందులో వినియోగదారులకు ప్రీమియం బ్యాక్ డిజైన్, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
మోటొరోలా జీ45 5జీ (Motorola G45 5G)
మీ బడ్జెట్‌ను రూ. 1000 పెంచగలిగితే, ఈ మోటరోలా లేటెస్ట్ 5జీ ఫోన్ మీకు మంచి ఆప్షన్‌గా ఉండనుంది.. మోటొరోలా జీ45 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999. అయితే ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని రూ.11,999కి విక్రయిస్తున్నారు. ఇది కాకుండా ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిత్ కార్డ్‌తో రూ.10,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో వినియోగదారులకు వేగన్ లెదర్ బ్యాక్ డిజైన్, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందుబాటులో ఉన్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే