Artificial Intelligenceతో మానవాళికి ముప్పు, దీర్ఘకాలంలో నష్టం.. AI పరిశోధకుడి భవిష్యవాణి
నేటి సమాజానికి Artificial Intelligence ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తోంది. అయితే, Deep Seel పరిశోధకుడు మాత్రం ఇది భవిష్యత్తులో చెడు ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

తక్కువ ధరలో AI చాట్‌బాట్‌లను తయారు చేయడం ద్వారా అమెరికా కంపెనీలకు చైనా కంపెనీ డీప్‌సీక్ గట్టి పోటీనిస్తోంది. అయితే భవిష్యత్తుకు సంబంధించి ఓ డీప్‌సీక్ పరిశోధకుడు ఒక భయానకమైన విషయాన్ని తెలిపారు. ఈ సాంకేతికత సమాజానికి ప్రమాదకరమని అన్నారు. ఇది కొంతకాలం మానవాళికి ప్రయోజనం చేకూర్చనుంది. కానీ దీర్ఘకాలంలో ఈ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద సవాలుగా మారవచ్చు అన్నారు. చైనా ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. డీప్‌సీక్ సీనియర్ రీసెర్చర్ చెన్ డై ఈ భయాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగాలను AI లాగేసుకుంటుంది - చెన్
రాబోయే 5- 10 సంవత్సరాలలో AI మన ఉద్యోగాలను లాగేసుకుంటుంది. రాబోయే 10- 20 సంవత్సరాలలో AI మోడల్స్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న అన్ని పనులను చేస్తాయని చెన్ డై అన్నారు. దీనివల్ల సమాజం ముందు పెద్ద సవాలు నిలవనుంది. తాను ఈ సాంకేతికతను తప్పుపట్టడం లేదని, అయితే దీని ప్రభావం సమాజంపై పడుతుందని, టెక్ కంపెనీలకు ఇది ముందే తెలుసని ఆయన అన్నారు.
AI క్రియేటర్లు కూడా ఏం చెబుతున్నారు
టెక్నాలజీ సమాజాన్ని కొంత పుంతలు తొక్కిస్తోంది. భూమి లోపల ఉన్న ఖనిజాల నుంచి అంతరిక్షంలో జరిగే పరిణామాలను టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ టెక్నాలజీలో వస్తున్న మార్పులు భవిష్యత్తులు మానవాళికి ప్రమాదమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. AI పితామహుడిగా పిలువబడే నోబెల్ బహుమతి గ్రహీత జెఫ్రీ హింటన్ ఇటీవల ఈ సాంకేతికత గురించి హెచ్చరికలు జారీ చేశారు.
ఏఐ ద్వారా ఉద్యోగులను భర్తీ చేసే సంస్థలు
పరిస్థితులు ఇలాగే కొనసాగితే, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు పడతారని జెఫ్రీ హింటన్ అన్నారు. పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించి, వారి పనులను AI ద్వారా చేయిస్తున్నాయని అన్నారు. ఈ కంపెనీలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి కారణం ఏమిటంటే, దీని ద్వారా భారీగా డబ్బు ఆదా చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు.
వారు మరింత ధనికులు అవుతారు
AI లాంటి టెక్నాలజీ కారణంగా అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి వారు మరింత ధనవంతులు అవుతారు. అదే సమయంలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతారని స్పష్టం చేశారు. కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకురావాలని, లేకపోతే టెక్నాలజీ ఉద్యోగాలను లాగేసుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సమస్యను కేవలం AIకి ఆపాదించకూడదని జెఫ్రీ హింటన్ అన్నారు. సమాజం, ఆర్థిక వ్యవస్థను ఈ విధంగానే తయారు చేయడం వల్ల సమస్య వస్తోందన్నారు.






















