WhatsApp AI Image generation: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
WhatsApp New Feature | వాట్సాప్ లో ఏఐ ద్వారా ఫొటోలు క్రియేట్ చేసి, స్టేటస్ లో షేర్ చేసుకునే వీలుంది. ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఈ మధ్య ఎటు చూసినా ఏఐ ఫొటోలు క్రియేట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది. ఇప్పుడు WhatsAppలో కూడా AIతో ఫొటోలను క్రియేట్ చేసే ఫీచర్ వచ్చింది. కంపెనీ స్టేటస్ అప్‌డేట్‌ల కోసం కొత్త AI ఆధారిత ఫీచర్‌ను రిలీజ్ చేసింది. దీని సహాయంతో వినియోగదారులు AI సహాయంతో తమకు నచ్చిన ఫోటోను క్రియేట్ చేసి, దానిని తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వర్కౌట్ అయితే కొన్ని వారాల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. Androidతో పాటు iOSలో కూడా ఈ ఫీచర్ తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.
టెక్స్ట్ ప్రాంప్ట్ నుండి ఫొటో క్రియేషన్
కొత్త ఫీచర్ మెటా మోడ్రన్ సాంకేతికతపై పనిచేస్తుంది. దీని ద్వారా ఫొటోలు తయారుచేయడానికి వినియోగదారు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక ఫొటో వస్తుంది. వినియోగదారులు దానిని తమ స్టేటస్‌లో షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏఐ ఫొటోలను తయారు చేసి స్టేటస్ పెట్టడం ఇక చాలా సులభం. దానిని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్‌లో ఏఐ ఫొటోలు తయారీ ప్రాసెస్..
- WhatsAppని ఓపెన్ చేసి కొత్త స్టేటస్ పెట్టడానికి అప్‌డేట్‌ల ట్యాబ్‌కి వెళ్లండి.
- ఇక్కడ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తున్న AI ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఫొటో రూపొందించడానికి ఇందులో ప్రాంప్ట్ రాయండి. ప్రాంప్ట్‌ను పంపండి
- మెటా AI దాని ఆధారంగా అనేక ఫొటోలను తయారు చేసి మీకు చూపుతుంది. వాటిలో మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకోండి.
- మీకు ఏ ఫొటో కూడా నచ్చకపోతే లేదా మీరు ఏదైనా చిత్రాన్ని ఎడిట్ చేయాలనుకుంటే, కొత్త ప్రాంప్ట్ లేదా సవరణకు సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి
- ఆ తర్వాత కొత్త ఏఐ ఫొటో వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని, దానిపై శీర్షిక, స్టిక్కర్ లేదా టెక్స్ట్ మొదలైన వాటిని ఇవ్వాలి
- చివరగా sendపై క్లిక్ చేయండి. అలా చేయడంతో ఈ ఫొటో మీ WhatsApp స్టేటస్‌లో అప్‌లోడ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్, కాంటాక్ట్ లో ఉన్నవారు ఈ స్టేటస్ ఫొటో చూడగలరు.






















