(Source: ECI/ABP News/ABP Majha)
iOS 16: ఐవోఎస్ 16 వచ్చేసింది - మెసేజ్‌ల్లో అతి పెద్ద ఫీచర్ - ఇక వాట్సాప్ తరహాలో!
యాపిల్ తన ఐవోఎస్‌కు లేటెస్ట్ అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. అదే ఐవోఎస్ 16.
యాపిల్ తన ఐవోఎస్ 16ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన లీకులు, రూమర్లకు తగ్గట్లుగానే తన ఆపరేటింగ్ సిస్టంకు మార్పులు చేర్పులు చేసింది. WWDC keynote eventలో యాపిల్ దీన్ని లాంచ్ చేసింది. సెప్టెంబర్‌లో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంను యాపిల్ తన ఐఫోన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఐఫోన్ 8 లేదా ఆ తర్వాత వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారికి ఈ ఓఎస్ అందుబాటులోకి రానుంది.
ఈ ఆపరేటింగ్ సిస్టం డెవలపర్ ప్రివ్యూ ఈ వారంలో విడుదల కానుంది. అలాగే పబ్లిక్ బీటాను వచ్చే నెలలో తీసుకురానున్నారు. ఐవోఎస్ 16 ద్వారా లాక్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచారు. విడ్జెట్ తరహా సామర్థ్యంతో వాల్ పేపర్లను వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. అప్‌కమింగ్ క్యాలెండర్ ఈవెంట్లు, వర్కవుట్ స్టేటస్‌లను కూడా వినియోగదారులు విడ్జెట్స్‌గా యాడ్ చేసుకోవచ్చు. వాల్ పేపర్ గ్యాలరీ నుంచి విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు.
ఫోకస్ మోడ్స్ కూడా...
ఈ ఫోకస్ మోడ్స్‌ను ఐవోఎస్ 15తో యాపిల్ పరిచయం చేసింది. ఇప్పుడు ఐవోఎస్ 16 ద్వారా వాటిని మరింత మెరుగుపరిచింది. లాక్ స్క్రీన్‌ను స్వైప్ చేయడం ద్వారా ఫోకస్ మోడ్స్‌ను వినియోగదారులు యాక్టివేట్ చేయవచ్చు.
మెసేజ్‌లను ఎడిట్ కూడా చేయవచ్చు
మెసేజెస్‌కు అతిపెద్ద అప్‌డేట్‌ను ఐవోఎస్ 16లో అందించారు. ఈ అప్‌డేట్ ద్వారా మెసేజెస్‌ను ఎడిట్ కూడా చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతోపాటు సిగ్నల్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ తరహాలో మెసేజ్‌లను డిలీట్ చేసే ఫీచర్‌ను కూడా తీసుకు వచ్చారు.
యాపిల్ వాలెట్
యాపిల్ వాలెట్‌కు షేరింగ్ కీస్ ఫీచర్‌ను కూడా తీసుకురానున్నారు. నాన్ యాపిల్ యూజర్లకు కూడా కీస్ షేర్ చేయడానికి ఐఈటీఎఫ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సపోర్ట్‌ను పొందడానికి యాపిల్ పని చేస్తుంది. యాపిల్ పే లేటర్‌ను కూడా యాపిల్ తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులు జీరో ఇంట్రస్ట్‌తో చెల్లింపులు చేయవచ్చు.
యాపిల్ మ్యాప్స్
11 కొత్త దేశాల్లో కూడా యాపిల్ మ్యాప్స్ సపోర్ట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు గూగుల్ మ్యాప్స్ తరహాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలు, ట్రావెల్ కాస్ట్ వివరాలను కూడా యాపిల్ మ్యాప్స్‌లో చూడవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!