అన్వేషించండి

Apple Smart Watches Launched: యాపిల్ స్మార్ట్ వాచ్ ప్రియుల కోసం ఒకేసారి 3 మోడల్స్ వచ్చేశాయ్.. ఫీచర్లు, ధర వివరాలిలా

యాపిల్ కంపెనీ స్మార్ట్ వాచ్ అల్ట్రా 3, సిరీస్ 11, SE 3 లను మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్లో ఆవిష్కరించింది. కొత్త చిప్‌సెట్, హెల్త్ ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

Apple Event 2025: ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్‌లు ఎంత ఎక్కువగా విక్రయాలు జరిగినా, యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. కానీ వీటి ధర అధికంగా ఉంటుంది. అయినా యాపిల్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఔత్సాహికుల కోసం ఆపిల్ ఒకేసారి అనేక కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ మంగళవారం రాత్రి నిర్వహించిన తన Awe Dropping ఈవెంట్‌లో పలు స్మార్ట్ వాచ్2లను విడుదల చేసింది. వీటిలో బడ్జెట్ ధర నుండి ప్రీమియం ఎంపికలు ఉన్నాయి. వీటిని ఈరోజు నుండి ప్రీ బుకింగ్ చేయవచ్చు. సెప్టెంబర్ 19 నుండి అందుబాటులోకి వస్తాయి. ఈ ఈవెంట్‌లో కస్టమర్ల కోసం ఏ కొత్త డివైజ్‌లు వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.

యాపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)

 యాపిల్ కంపెనీ ఈ ప్రీమియం వాచ్‌లో మన్నికతో పాటు పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. Apple Watch Ultra 3 ప్రస్తుత మోడల్ కంటే మెరుగైన రిజల్యూషన్ డిస్‌‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. ఇది కొత్త S11 చిప్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన పనితీరుతో గత వాచ్‌ల కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిప్ బ్యాటరీ లైఫ్ ను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకేసారి చేసే ఛార్జ్‌పై ఎక్కువ గంటలు పని చేస్తుంది. ఇది మెరుగైన GPS ట్రాకింగ్, శాటిలైట్ కనెక్టివిటీ, అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లతో వచ్చింది. 

యాపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3)

యాపిల్ బెస్ట్, బడ్జెట్ ధరలో వాచ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఛాయిస్. కంపెనీ దాని డిజైన్‌కు ప్రత్యేకంగా ఎలాంటి అప్‌గ్రేడ్ చేయలేదు, కానీ దీనికి కొత్త S11 చిప్ అమర్చారు. ఇది మెరుగైన పనితీరును అందించడానికి దోహదం చేస్తుంది. అలాగే, కొత్త చిప్‌సెట్ దాని బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాపిల్ కొత్త రంగు, పట్టీ ఎంపికలను జత చేసింది. భారత్‌లో ఎస్‌ఈ3 ధర రూ.25,900గా నిర్ణయించారు.

యాపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)

యాపిల్ కొత్త వాచ్ సిరీస్ 11 ను కూడా తాజా లాంచింగ్ ఈవెంట్లో రిలీజ్ చేసింది. దీనిలో కొత్త చిప్‌సెట్ కూడా అమర్చింది. డిస్ ప్లేలో మార్పులు చేశారు. 5G కనెక్టివిటీ కోసం మీడియాటెక్ మోడెమ్ సపోర్ట్ ఇచ్చారు. ఆరోగ్యానికి సంబంధించి..  అధిక రక్తపోటు (High BP)ని గుర్తించి వెంటనే అలర్ట్‌ చేస్తుంది. స్లీప్‌ స్కోర్‌, నిద్రపోయే సమయం, ఎన్నిసార్లు మెలుకువ వచ్చింది, ప్రతి స్లీప్‌ స్టేజీలో ఎంత టైం పడుకున్నామో ఈ కొత్త వాచ్‌ల్లో ఉంటాయి. గత సిరీస్ రంగు మసకబారడంపై ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కొత్త రంగు ఎంపికలు, బ్యాండ్ డిజైన్‌లను కూడా తీసుకొచ్చింది. భారత్‌లో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 11 ధర  రూ.46,900గా నిర్ణయించారు.

ధర ఎంత?

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)- $ 799

ఆపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3)- $ 249

ఆపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)- $ 399

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget