Amazon Sale 2021: ఈ వివో ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.20 వేల వరకు తగ్గింపు!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వివో వీ21 5జీ స్మార్ట్ ఫోన్‌ను రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందించారు. ఈ సేల్‌లో వివో వీ21 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందించారు. ఎమ్మార్పీ, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకుంటే దీనిపై రూ.20 వేల వరకు తగ్గింపు అందించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వివో వీ21 5జీలో లేటెస్ట్ స్పెసిఫికేషన్లు అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.32,990 కాగా, దీనిపై రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.29,990కు తగ్గింది. దీంతోపాటు ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.1,250 తగ్గింపు లభించనుంది. ఒకవేళ మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే.. అదనంగా రూ.17,500 తగ్గింపు లభించనుంది.
వివో వీ21 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై వివో వీ21 5జీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది. దీని మందం 0.73 సెంటీమీటర్లుగానూ, బరువు 176 గ్రాములుగానూ ఉంది.
వివో వీ21 5జీ స్మార్ట్ ఫోన్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)