Airtel Jio Opensignal Report: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోను మించిపోయిన ఎయిర్ టెల్ - పోటీ మామూలుగా లేదు!
దేశంలో 5G సేవలు ప్రారంభం అయిన నేపథ్యంలో 4 ప్రధాన మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ల పనితీరుపై ‘ఓపెన్ సిగ్నల్’ అభిప్రాయ సేకరణ చేసింది. 90 రోజుల పని తీరును పరిశీలించి కీలక నివేదిక విడుదల చేసింది.
![Airtel Jio Opensignal Report: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోను మించిపోయిన ఎయిర్ టెల్ - పోటీ మామూలుగా లేదు! Airtel tops in download speeds, Reliance Jio in coverage availability OpenSignal Report Airtel Jio Opensignal Report: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోను మించిపోయిన ఎయిర్ టెల్ - పోటీ మామూలుగా లేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/14/6167bcbe9b5bd88dc7859f2ca9cf3e921665723099618544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 5G సేవలు దేశంలో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నాలుగు ప్రధాన టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు 5G సేవలు అందిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా 5G సేవలను ప్రారంభించిన సంస్థగా ఎయిర్ టెల్ గుర్తింపు పొందింది. ఆ తర్వాత స్థానంలో రిలయన్స్ జియో ఈ సేవలను మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశంలోని 8 నగరాల్లో 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘ఓపెన్ సిగ్నల్’ సంస్థ.
డౌన్ లోడ్ లో ఎయిర్ టెల్ బెస్ట్
తాజాగా ‘ఓపెన్ సిగ్నల్’ తన నివేదిక విడుదల చేసింది. ఇందులో ఎయిర్ టెల్ సంస్థ తన వినియోగదారులకు అత్యుత్తమ డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. కన్వర్జ్డ్, వైర్ లెస్, బ్రాడ్ బ్యాండ్ సహా అన్ని విభాగాల్లో ఎయిర్ టెల్ అద్భుత పనితీరును కనబరుస్తున్నట్లు వెల్లడించింది. సగటు వినియోగదారుకు ఎయిర్ టెల్ 13.6 Mbps డౌన్ లోడ్ స్పీడ్ అందిస్తున్నట్లు తెలిపింది. మిగతా పోటీదారులతో పోల్చితే 0.3 Mbps నుంచి 0.6 Mbps ఎక్కువ వేగాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. అటు BSNL కంటే దాదాపు 10.6 Mbps వేగంతో ఉత్తమ డౌన్ లోడ్ స్పీడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
90 రోజుల పాటు సర్వే
భారతదేశంలోని నాలుగు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ లలోని వినియోగదారుల మొబైల్ నెట్ వర్క్ అనుభవాన్ని‘ఓపెన్ సిగ్నల్’ పరిగణలోకి తీసుకుంది. జూన్ 1, 2022 నుంచి ఆగస్టు 29, 2022 వరకు ఈ పరిశీలన జరిగింది. 90 రోజుల వ్యవధిలో జాతీయంగా, 22 టెలికాం సర్కిల్‌లలో పనితీరును అంచనా వేసిన తర్వాత ‘ఓపెన్ సిగ్నల్’ ఈ నివేదిక వెల్లడించింది. భారతీయ మొబైల్ నెట్ వర్క్‌లలో క్వాలిటీ ఆఫ్ ఎక్సపీరియన్స్ (QoE) విషయానికి వస్తే Airtel మంచి పనితీరును అందిస్తుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు వీడియోలను స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు, మల్టీప్లేయర్ మొబైల్ గేమ్ లను ఆడుతున్నప్పుడు, మొబైల్ నెట్ వర్క్‌లలో ఓవర్-ది-టాప్ (OTT) వాయిస్ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఎక్స్ పీరియన్స్ పొందారని సదరు నివేదిక పేర్కొన్నది.
4G కవరేజ్ లో ముందున్న రిలయన్స్ జియో
కవరేజ్ విషయానికి వస్తే జియో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఈ విభాగంలో జియోతో మరే నెట్ వర్క్ పోటీ పడలేకపోయింది. “భారతీయ వినియోగదారులు Jioకు సంబంధించిన 4G నెట్ వర్క్ లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు కనెక్ట్ చేయబడిన అత్యధిక సమయాన్ని (99.4%) ఖర్చు చేయగలిగారు" అని నివేదిక పేర్కొంది. జియో 4G కవరేజ్ ఎక్స్‌పీరియన్స్ విషయంలోనూ ముందుంది. జియో వినియోగదారుల అత్యధికంగా 100 స్థానాల్లో 95 లొకేషన్‌లను సందర్శిచి 4Gకి కనెక్ట్ అయినట్లు గుర్తించింది.
గమనిక: సర్వేలో పేర్కొన్న వివరాలను యథావిధిగా అందించాం. ఇందులోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)