Airtel Rs 265 Plan: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎక్కువ డేటా!
ఎయిర్‌టెల్ తన రూ.265 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా లభించనుంది.
ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన రూ.265 ప్లాన్‌ను సవరించింది. ఇప్పుడు ఈ ప్లాన్ మరింత రోజువారీ డేటాను అందించనుంది. అయితే దీని ధరలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు.
ఎయిర్‌టెల్ రూ.265 ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ రూ.265 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేస్తే 30 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా లభించనుంది. అంటే మొత్తంగా 45 జీబీ డేటా లభించనుందన్న మాట. డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభించనున్నాయి. రోజువారీ డేటా లిమిట్ పూర్తయితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోనుంది.
దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ లాభాలతో పాటు వింక్ మ్యూజిక్, హలో ట్యూన్ యాక్సెస్ లభించనుంది. గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ మాత్రమే లభించనుంది. ఇప్పుడు ఈ డేటా లిమిట్ 1.5 జీబీకి పెరిగింది. ఈ ప్లాన్ కావాలంటే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్లో రీచార్జ్ చేసుకోవచ్చు.
ఎయర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇటీవలే లఢఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో లాంచ్ అయింది. అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్లు రూ.499 నుంచి ప్రారంభం కానుంది. 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను ఇవి అందించనున్నాయి. దీంతోపాటు ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సర్వీసులకు సబ్‌స్క్రిప్షన్లు కూడా లభించనున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram