Airtel Netflix Plan: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ - రీఛార్జ్‌కు ఎంత పెట్టాలి?
Airtel Netflix Subscription Plan: ఎయిర్‌టెల్ రూ.1,499 ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
Airtel Netflix Prepaid Plan: మొట్టమొదటిసారిగా ఎయిర్‌టెల్ దాని ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వాన్ని అందిస్తోంది. దీంతోపాటు మీరు హై స్పీడ్ 5జీ ఇంటర్నెట్‌ను కూడా పొందవచ్చు. టెలికాం టాక్ నివేదిక ప్రకారం మొబైల్ రీఛార్జ్‌పై ఎయిర్‌టెల్ వినియోగదారులకు 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ విషయంలో కంపెనీ ఎలాంటి సమాచారాన్ని పబ్లిక్‌గా షేర్ చేయనప్పటికీ, ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ని తన వెబ్‌సైట్, యాప్‌లో యాడ్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి?
ఎయిర్‌టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ లభించనుంది. ఇందులో మీరు 3 జీబీ హై స్పీడ్ 5జీ ఇంటర్నెట్ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా పొందుతారు. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 199గా ఉంది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్... నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించడం ఇదే మొదటిసారి. ఇతర టెలికాం ఆపరేటర్లు ఇప్పటికే ఈ తరహా ప్లాన్లు అందిస్తున్నాయి.
జియో రూ. 1,499 ప్లాన్‌లో...
మీరు జియో సిమ్ కార్డును ఉపయోగిస్తే రూ. 1,499 ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో, కంపెనీ మీకు 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో సినిమా, జియో టీవీతో సహా ప్రతిరోజూ 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. మీరు జియో వెల్‌కం ఆఫర్‌ను స్వీకరించినట్లయితే, అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు.
వొడాఫోన్ ఐడియా సంగతేంటి?
వొడాఫోన్ ఐడియా ప్రతిరోజూ 3 జీబీ డేటాతో ప్లాన్‌లను అందిస్తుంది. కంపెనీ 28 రోజుల పాటు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని రూ. 359కి అందిస్తుంది. అయితే దీనిలో మీరు ఏ ఓటీటీ యాప్‌కు సభ్యత్వాన్ని పొందలేరు. వీఐ దాని ప్రీపెయిడ్ ప్లాన్‌తో బింజ్ ఆల్ నైట్ సదుపాయాన్ని అందిస్తుంది. దీనిలో మీరు అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎంత డేటానైనా ఉపయోగించవచ్చు.
మరోవైపు శాంసంగ్ గెలాక్సీ ఏ05 స్మార్ట్ ఫోన్ కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఏ04కు తర్వాతి వెర్షన్‌గా శాంసంగ్ గెలాక్సీ ఏ05 మార్కెట్లోకి వచ్చింది. మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ05 రన్ కానుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మూడు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర మనదేశంలో రూ. 12,499 నుంచి ప్రారంభం కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!