Airtel 5G: దేశంలో మొదటిసారి 5జీ ట్రయల్స్ ప్రారంభించిన ఎయిర్‌టెల్ - ఎక్కడంటే?
భారతీ ఎయిర్‌టెల్ తన 5జీ ట్రయల్స్‌ను బెంగళూరులోని బోస్ (Bosch) ఆటోమోటివ్ ఎలక్ట్రికల్స్ ఇండియా ఫెసిలిటీలో ప్రారంభించింది.
భారతీ ఎయిర్‌టెల్ మనదేశంలో విజయవంతంగా 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. బెంగళూరులోని బోస్ (Bosch) ఆటోమోటివ్ ఎలక్ట్రికల్స్ ఇండియా ఫెసిలిటీలో ఈ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. దీంతో దేశంలో 5జీ ట్రయల్స్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.
నాణ్యతను మెరుగుపరచడం కోసం ఎయిర్‌టెల్ రెండు ఇండస్ట్రియల్ గ్రేడ్ యూజ్ కేస్‌లను ఇందులో ఉపయోగించింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రయల్ స్పెక్ట్రంకు కొన్ని వేల డివైస్‌లు కనెక్ట్ అయ్యాయని, ఇంటర్నెట్ సెకనుకు జీబీల్లో వచ్చిందని తెలిసింది.
ఎయిర్‌టెల్ 5జీ ప్రైవేట్ నెట్‌వర్క్‌తో బోస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టం కూడా వేగంగా పని చేసింది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఫ్లోర్ మేనేజర్లు, ఆపరేటర్లు కూడా సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ ఉపయోగపడిందట.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
View this post on Instagram