(Source: ECI/ABP News/ABP Majha)
Dhoni: రెట్రో జెర్సీలో ధోనీ... ఓ యాడ్ షూట్లో... దుబాయ్‌లో ధోనీ
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతడితో కొన్ని సంస్థలు యాడ్స్ కోసం క్యూ కడుతూనే ఉన్నాయి.
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతడితో కొన్ని సంస్థలు యాడ్స్ కోసం క్యూ కడుతూనే ఉన్నాయి. IPL-2021 రెండో సీజన్‌కి ముందు ధోనీ పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాదు, దుబాయ్ వెళ్లే ముందు ఆయా యాడ్ షూట్లు కూడా ఫినిష్ చేసేశాడు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ అగర్బత్తీల యాడ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ యాడ్‌లో ధోనీ టీమిండియా రెట్రో జెర్సీని ధరించడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ యాడ్ పై ఓ లుక్కేయండి.
Join us as we celebrate Prayers and Hardwork with our Brand Ambassador M.S. Dhoni. Hear it from the one who is a real Game Changer. Stand up, Fight your fears and Pray for Success.@msdhoni @thefarahkhan @DabbooRatnani#PrarthnaHogiSweekar #ZBMSDRetro #ZedBlack #msdhoni #Dhoni pic.twitter.com/LF70Ec6e5n
— Zed Black (@zedblackin) August 15, 2021
మరో అంతర్జాతీయ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ అంతర్జాతీయ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ సంస్థ తాజాగా ధోనీతో ఒప్పందం చేసుకుంది. భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగ నిర్థారణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్. ప్రతీ పౌరుడికి మెరుగైన సేవలు, ఆరోగ్య సంరక్షణ అందించేందుకు చేస్తున్న కృషిపై అవగాహన కల్పించేందుకు ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
THE B E A S T LOOK 😎🔥
— DHONI Trends™ (@TrendsDhoni) August 17, 2021
Design : @SagarPspkDesign@MSDhoni | #MSDhoni | #WhistlePodu pic.twitter.com/XhBCgNVTAZదేశవ్యాప్తంగా మంచి ఆరోగ్య సంరక్షణను అందించేందుకు న్యూబర్గ్ ఎంతో అంకిత భావంతో పని చేస్తోందని, అది తనకు బాగా నచ్చిందని ఈ సందర్భంగా ధోనీ వెల్లడించాడు. అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు వారు, వారి బృందం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం పట్ల ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు.
న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేలు మాట్లాడుతూ... దేశంలో తమ వ్యాపారం విస్తరించేందుకు ధోనీ అండ ఉంటాడని, తమ అభివృద్ధి ప్రణాళికలకు ఇది వ్యూహాత్మకంగా సరిపోతుందన్నారు. ధోనీతో ఒప్పందం తమలో నూతన ఉత్సాహం నింపిందని, తమ సంస్థ ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మేం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. డయాగ్నస్టిక్స్ సేవలను దేశమంతటా విస్తరించాలని అనుకుంటున్నాం, అంతే కాదు అందుబాటులో ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే తమ లక్ష్యమని అందుకోసం ఎంతైనా కష్టపడతామని తెలిపారు.