అన్వేషించండి

SC on WFI Election: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై గువహతి కోర్టు స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై గువహతి (అస్సాం) హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది.

SC on WFI Election: గత కొంతకాలంగా వరుసగా వాయిదాపడుతూ వస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై  గువహతి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఎన్నికలలో తమకు కూడా ఓటింగ్ హక్కు కల్పించాలని కోరుతూ అస్సాం రెజ్లింగ్ సంఘం (ఏడబ్ల్యూఏ) దాఖలుచేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా గువహతి కోర్టు జులై 28న విచారించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికలు అప్పటిదాకా నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. కానీ తాజాగా  ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్  దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను నిలిపివేయాలని గువహతి కోర్టు విధించిన  స్టేను నిలిపేసింది.  

వాస్తవానికి డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు చాలారోజులుగా వాయిదాపడుతూ వస్తున్నాయి. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై  పలువురు రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది మే 7 న ఈ ఎన్నికలు నిర్వహించాలని భావించినా  పలు కారణాల రీత్యా అది జూన్ 30కు వాయిదాపడింది. మళ్లీ ఆ తేదీ జులై 4కు మారింది. అప్పుడు కూడా వాయిదాపడి  ఆరో తేదీన నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. 

 

కాగా తమకు ఈ  ఎన్నికలలో ఓటు వేసే అధికారం కల్పించాలని  కోరుతూ అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్.. గత నెలలో గువహతి  కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ  కేసుకు సంబంధించిన విచారణ వాయిదాపడుతూ వస్తోంది. జులై  17న  ఈ కేసులో విచారణ ఉన్నప్పటికీ డబ్ల్యూఎఫ్ఐ న్యాయవాది  కోర్టు ఎదుట హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో గువహతి హైకోర్టు స్పందిస్తూ.. ఈనెల 26న అఫిడవిట్ దాఖలు చేయాలని, 28న విచారణకు హాజరుకావాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. దీంతో ఈనెల 28 వరకూ ఈ ఎన్నికలు జరిగే ఆస్కారం లేదని తేలిపోయింది. 

కానీ ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ ఈ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని.. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం తరఫున న్యాయవాది అనూజ్ త్యాగి సుప్రీంకోర్టులో ప్లీ  దాఖలు చేశారు.   డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను  తాత్కాలికంగా నిలిపివేయాలని  గువహతి కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని అనూజ్ త్యాగి.. తన పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు  వాదనలను విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, ఎస్. వి. భట్టిల  ధర్మాసనం.. స్టే ను నిలిపేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు, డబ్ల్యూఎఫ్ఐకి, అస్సాం రెజ్లింగ్ సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
Embed widget