X

ODI Captaincy: భారత క్రికెట్లో సున్నిత సమస్య..! కెప్టెన్సీపై రోహిత్‌, కోహ్లీతో సెలక్టర్ల చర్చ!

వన్డే సారథ్యంపై విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో సెలక్టర్లు మాట్లాడనున్నారని తెలిసింది. రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీకి తమ పాత్రల గురించి వివరించనున్నారు.

FOLLOW US: 

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత క్రికెట్లో స్తబ్ధత నెలకొంది! అత్యంత సున్నితత్వంతో కూడిన నాయకత్వ సమస్యపై సుదీర్ఘ చర్చ జరగనుంది. వన్డే సారథ్యంపై విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో సెలక్టర్లు మాట్లాడనున్నారని తెలిసింది.

న్యూజిలాండ్‌ టెస్టు సిరీసు ముగిసిన రోజే దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేస్తారని భావించారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో షెడ్యూలును మరో వారం రోజులు పొడగించడంతో ఇంకా చేయలేదు. అయితే వన్డే పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై జట్టు యాజమాన్యంలో చర్చ జరుగుతోంది. విరాట్‌ కోహ్లీని కొనసాగించాలా? లేదా రోహిత్‌ శర్మకు అప్పగించాలా? అని ఆలోచిస్తున్నారు.

భారత క్రికెట్లో ఇది అత్యంత సున్నితమైన సమస్యగా కనిపిస్తోంది! ఇప్పటికే టీ20 కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించారు. మొత్తంగా తెలుపు బంతి క్రికెట్‌ బాధ్యతలను అతడికే అప్పగిస్తే మంచిదని కొందరు అంటున్నారు. మున్ముందు జరిగే మెగా టోర్నీలకు జట్టును సిద్ధం చేసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది తొమ్మిది వన్డేలకు మించి లేవు కాబట్టి కోహ్లీనే కొనసాగించాలని మరికొందరు చెబుతున్నారు. ఇలాంటి అయోమయ పరిస్థితి నెలకొనడంతో సెలక్టర్లకు దిక్కుతోచడం లేదు.

పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మను పిలిపిస్తున్నారు. వారిద్దరికీ భవిష్యత్తు ప్రణాళిక వివరించాలని అనుకుంటున్నారు. ఒకవేళ కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగిస్తే రోహిత్‌శర్మకు తన పాత్రపై స్పష్టతనిస్తారు. లేదా హిట్‌మ్యాన్‌కు పగ్గాలు అప్పగిస్తే కోహ్లీకి తన పాత్ర గురించి చెబుతారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో వన్డే కెప్టెన్సీ సంగతి తేలిపోనుంది.

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!

Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌

Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Virat Kohli Rohit Sharma Team India South Africa Tour Indian Selectors ODI captaincy

సంబంధిత కథనాలు

Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?

Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?

IPL 2022: బాహుబలికి కెప్టెన్సీ ఇవ్వరేమో! ఆకాశ్‌ చోప్రా అనుమానం!!

IPL 2022: బాహుబలికి కెప్టెన్సీ ఇవ్వరేమో! ఆకాశ్‌ చోప్రా అనుమానం!!

IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?

IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?

PM Modi letter to Kevin Pietersen: మోదీకి పీటర్సన్‌ కృతజ్ఞతలు! మీ హిందీ ట్వీట్లు బాగుంటాయని అతడికి మోదీ లేఖ!!

PM Modi letter to Kevin Pietersen: మోదీకి పీటర్సన్‌ కృతజ్ఞతలు! మీ హిందీ ట్వీట్లు బాగుంటాయని అతడికి మోదీ లేఖ!!

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల