ROHIT SHARMA: మూడో వన్డేలో ఈ రికార్డుపై కన్నేసిన రోహిత్ - ఒక్క పరుగు చేస్తే చాలు!
శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో రోహిత్ ఒక్క పరుగు చేసి, భారత్ విజయం సాధిస్తే తను మరో రికార్డు సాధించనున్నాడు.
Rohit Sharma record: భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మరో పెద్ద రికార్డు సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. భారత జట్టు విజయం సాధించిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 11,999 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో 12 వేల పరుగులు పూర్తి చేయాలటే రోహిత్ కనీసం ఒక పరుగు సాధించాలి, అదే సమయంలో జట్టు గెలవాలి. భారత జట్టు తన తదుపరి వన్డేను శ్రీలంకతో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా, ఇందులో టీమ్ ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది.
ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ జనవరి 15, ఆదివారం జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో జట్టు విజయం సాధిస్తే రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేయాల్సి ఉంది. ఇలా చేయడం ద్వారా భారత జట్టు విజయంలో తన మొత్తం 12 వేల పరుగుల (Rohit Sharma will complete 12000 runs)ను పూర్తి చేస్తాడు.
ఇప్పటివరకు ఈ ఇద్దరే
ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ రికార్డును అధిగమించారు. భారత జట్టు విజయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 16,119 పరుగులు చేశాడు. అదే సమయంలో మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ జట్టు విజయంలో 17,113 పరుగులతో ముందున్నాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. భారత మాజీ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ 10,860 పరుగులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
430 మ్యాచ్‌ల్లో...
2007లో భారత జట్టు (Team India) తరుపున అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు జట్టు తరపున మొత్తం 430 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 45 టెస్టులు, 237 వన్డేలు, 148 టీ20లు ఉన్నాయి. టెస్టుల్లో 3,137 పరుగులు, వన్డేల్లో 9,554 పరుగులు, టీ20ల్లో 3,853 పరుగులు సాధించాడు.
View this post on Instagram