Rohit Sharma on Kohli: విరాట్ వారసత్వంపై తొలిసారి పెదవి విప్పిన రోహిత్..! ఏమన్నాడో తెలుసా?
కోహ్లీ నాయకత్వంలో జట్టు గెలుపు కోసమే ఆడిందని రోహిత్ వెల్లడించాడు. భారత్ 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడంపై అభిమానులు బాధపడుతున్నారని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రతి సందర్భాన్ని తాను ఆస్వాదించానని టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. అతడి నాయకత్వంలో జట్టు గెలుపు కోసమే ఆడిందని వెల్లడించాడు. భారత్ 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడంపై అభిమానులు బాధపడుతున్నారని పేర్కొన్నాడు. వారి కలలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
'విరాట్ కోహ్లీ ఐదేళ్లు జట్టును నడిపించాడు. ప్రతిసారీ అతడు ముందుండి నాయకత్వం వహించాడు. మేమెప్పుడు మైదానంలోకి వచ్చినా అకుంఠిత దీక్ష, పట్టుదలతో ఆడేవాళ్లం. ప్రతి మ్యాచ్ గెలిచేందుకే ప్రయత్నించేవాళ్లం. జట్టు అంతటికీ అదే సందేశం ఉండేది. కోహ్లీ సారథ్యంలో మేం గొప్ప సందర్భాలని ఆస్వాదించాం. అతడి నేతృత్వంలో నేనెంతో క్రికెట్ ఆడాను. ప్రతి సందర్భాన్ని నేను ఆస్వాదించాను. ఇకపైనా చేస్తాను' అని రోహిత్ అన్నాడు.
Goals & excitement 👍
— BCCI (@BCCI) December 13, 2021
Working with Rahul Dravid 👌@imVkohli's legacy as India's white-ball captain 👏#TeamIndia's new white-ball captain @ImRo45 discusses it all in this special feature for https://t.co/Z3MPyesSeZ 👍 👍
Watch the full interview 🎥 🔽https://t.co/JVS0Qff905 pic.twitter.com/kFlqZxWh5t
'తుది ఫలితం గురించి ఆలోచించడానికి ముందే మేం ఎన్నో విషయాలను సరి చేసుకోవాలి. మేం చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ గెలిచాం. ఆ తర్వాత మేమేమీ తప్పు చేశామని అనుకోవడం లేదు. ఒక జట్టుగా మేం బాగానే ఆడాం. అయితే ఒక అదనపు అడుగు మాత్రమే వేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా అవుతుంటుంది. ఆ స్థాయిలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. త్వరలో చాలా ప్రపంచ కప్‌లు రానున్నాయి. వాటిల్లో టీమ్‌ఇండియా బాగా ఆడాలని కోరుకుంటోంది. ఛాంపియన్‌షిప్ గెలవడంపైనే మా దృష్టి ఉంది. ఒక బృందంగా మేం ప్రక్రియను అనుసరించాలి' అని రోహిత్ స్పష్టం చేశాడు.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి