Praggnanandhaa: వరల్డ్ నెం.2కు చుక్కలు చూపించిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద
Praggnanandhaa Norway Tournament: యువ భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అదరగొట్టాడు. నార్వే చెస్ టోర్నమెంట్‌లో ఐదో రౌండ్ క్లాసికల్ చెస్ లో వరల్డ్ నంబర్ 2 ఫాబియానో కరువానాను ఓడించాడు.
![Praggnanandhaa: వరల్డ్ నెం.2కు చుక్కలు చూపించిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద Praggnanandhaa continues meteoric rise stuns World No 2 Caruana in Norway Chess Praggnanandhaa: వరల్డ్ నెం.2కు చుక్కలు చూపించిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/e77cbf77f39b9383bbdc051b17de2a6b17173455121551036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
R Praggnanandhaa shocks Fabiano Caruana: భారత యువ సంచలనం ప్రజ్ఞానంద(Praggnanandhaa) నార్వే టోర్నమెంట్(Norway Chess tournament )లో తన సత్తా చాటాడు. నిన్న గాక మొన్న ఇదే టోర్నీలో రౌండ్ 3 లో ప్రపంచ నెం.1 కార్ల్‌సన్(Magnus Carlsen)ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద ఇప్పుడు తాజాగా వరల్డ్‌నెం. 2 ఫాబియానో కరువానా(Fabiano Caruana)ను ఓడించాడు. దీంతో క్లాసికల్ చెస్‌లో టాప్ లో ఉన్న ఇద్దరి ఆటగాళ్లను ఓడించినట్టు అయ్యింది. ఇలాంటి ఫీట్ చేయటం ప్రజ్ఞానందకు ఇదే తొలిసారి. అయితే నాల్గవ రౌండ్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. ఒక ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద ఫాబియానోతో ఆదివారం తలపడ్డాడు. ఇక ఈ టోర్నీలో 5 రౌండ్లు ముగిసేసరికి ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా టాప్ ప్లేయర్లను ఓడించడం ద్వారా ప్రజ్ఞా అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్10లోకి దూసుకొచ్చాడు. నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకొని పదో స్థానం సాధించాడు. టోర్నీలో మరో ఐదు రౌండ్లు జరగాల్సి ఉంది. మరోవైపు, అతని సోదరి వైశాలి దిగ్గజ క్రీడాకారిణి, స్వీడన్‌కు చెందిన పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది.
Pragg.
— anand mahindra (@anandmahindra) June 2, 2024
Now, it was the world #2 in the bagg…pic.twitter.com/ubBHzAjVlu
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)