T20 World Cup 2021: ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే..! ఎవరెవరు ఉన్నారో తెలుసా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో పోరుకు పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. మ్యాచుకు ఒక రోజు ముందు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పోరుకు వేళైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆదివారమే దాయాదుల సమరం జరుగుతోంది. దుబాయ్ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వనుంది.
భారత్, పాక్ తలపడే మ్యాచులో ఆడే ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఎవరికి అవకాశం వచ్చినా దానికి సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే మొదటి పోరుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆదివారం టాస్ పడ్డాక తుది జట్టు తెలియనుంది.
పాక్ (12) జట్టు ఇదే
బాబర్ ఆజామ్ (కెప్టెన్, బ్యాటర్)
అసిఫ్ అలీ (బ్యాటర్)
ఫకర్ జమాన్ (బ్యాటర్)
హైదర్ అలీ (బ్యాటర్)
మహ్మద్ రిజ్వాన్ (కీపర్, బ్యాటర్)
ఇమాద్ వసీమ్ (ఆల్‌రౌండర్)
మహ్మద్ హఫీజ్ (ఆల్‌రౌండర్)
షాబాద్ ఖాన్ (ఆల్‌రౌండర్)
షోయబ్ మాలిక్ (ఆల్‌రౌండర్)
హ్యారిస్ రౌఫ్ (బౌలర్)
హసన్ అలీ (బౌలర్)
షాహిన్ షా అఫ్రిది (బౌలర్)
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఆడిన ఐదుసార్లు టీమ్‌ఇండియానే విజయం సాధించింది. అరంగేట్రం ప్రపంచకప్‌లోనే రెండుసార్లు ఈ జట్లు తలపడ్డాయి. మొదటి మ్యాచులో స్కోర్లు టై కావడంతో బౌల్ ఔట్‌లో ధోనీసేన విజయం అందుకుంది. ఇక ఫైనల్లో గౌతమ్ గంభీర్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఆదివారం జరిగే మ్యాచులో గెలవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
Pakistan's 12 for their #T20WorldCup opener against India.#WeHaveWeWill pic.twitter.com/vC0czmlGNO
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2021
Also Read: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్ న్యూస్!
Also Read: ఆ జట్లే ఫేవరెట్.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్ జోస్యం
Also Read: విరాట్ కోహ్లీ కన్నా బాబర్ ఆజామ్ అంత గొప్పా? పాక్-భారత్ పోరులో విజేత ఎవరు?
Also Read: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
So tommorow is the Big day. Arch Rivals will be facing each other in T20 word Cup after 5 Years. Thank God Daraz will be providing live streaming for people like me who are always on the Go. #PakVsInd #LiveonDaraz pic.twitter.com/RAGhPR8Rv8
— Awais Javed (@AwaixJaved) October 23, 2021