IPL 2022: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్ న్యూస్!
వచ్చే ఐపీఎల్ వేలానికి సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల రీటెన్షన్‌పై ఫ్రాంచైజీలకు కాస్త స్పష్టత ఇచ్చింది. కొందరిని తీసుకొనేందుకు అనుమతి ఇచ్చింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్త! వచ్చే సీజన్లో నలుగురు ఆటగాళ్లను తీసుకొనేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలిసింది. రైటు టు మ్యాచ్‌కు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. ముగ్గురు స్వదేశీయులు, ఒక విదేశీయుడు లేదా ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చని అంటున్నారు.
వచ్చే ఏడాది నుంచి పది జట్ల ఐపీఎల్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది జట్లే ఉండగా మరో రెండు జట్ల కోసం బీసీసీఐ బిడ్డింగులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం ఎక్కువ మంది ఆటగాళ్లతో మెగా వేలం నిర్వహించనుంది. అయితే తమ కీలక ఆటగాళ్లు తమకే ఉండాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఐపీఎల్ 2021 ముగిశాక ఫ్రాంచైజీలో బీసీసీఐ ఓ సమావేశం నిర్వహించింది. అందులోనే ఆటగాళ్ల రీటెన్షన్‌పై అనధికారికంగా చర్చ నడిచిందని తెలిసింది. నలుగురుని తీసుకొనేందుకు బోర్డు సుముఖంగానే ఉంది. ఇక ఆటగాళ్ల కొనుగోలు చేసే పర్స్ రూ.90 కోట్లుగా ఉంది. ఏడాదికి రూ.ఐదు కోట్ల చొప్పున వచ్చే రెండేళ్లలో ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుంది. ఒకవేళ తమ పాత ఆటగాళ్లనే రీటెయిన్ చేసుకుంటే పర్స్ విలువ తగ్గుతుంది.
కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఓ అవకాశం ఇవ్వనుంది. వేలంతో సంబంధం లేకుండా కొందరు కీలక ఆటగాళ్లను తీసుకొనేందుకు వారికి అనుమతి ఇస్తామని ప్రస్తుత ఫ్రాంచైజీలకు చెప్పింది. మిగతా జట్లు రీటెయిన్ చేసుకోని ఆటగాళ్ల నుంచి వీరు ఉంటారని వెల్లడించింది. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం)కు మాత్రం ససేమిరా అంటోంది.
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల పోటీలో ప్రముఖులే ఉండటంతో బీసీసీఐకి ఎక్కువ డబ్బులు వస్తాయని అంచనా వేస్తున్నారు. సంజీవ్ గోయెంకా, గ్లేజర్ ఫ్యామిలీ (మాంచెస్టర్ క్లబ్), అదానీ గ్రూప్, నవీన్ జిందాల్, టొరెంట్ ఫార్మా, రోనీ స్క్రూవాలా, అరబిందో ఫార్మా, కొటక్ గ్రూప్, సీవీసీ పార్ట్‌నర్స్, సింగపూర్‌కు చెందిన పీఈ ఫర్మ్, హిందుస్థాన్ టైమ్స్, ఐటీడబ్ల్యూ, గ్రూప్ ఎం, దీపికా-రణ్‌వీర్ పోటీలో ఉన్నారు. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.3500-4000 కోట్ల వరకు బీసీసీఐ ఆర్జించనుంది.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ