అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: మనూ బాకర్ ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్లో ఈఫిల్ టవర్, ఎలా వచ్చిందో తెలుసా?
Olympic Games Paris 2024: ఈ ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు అందించిన షూటర్ మను భాకర్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అందరి దృష్టి మను ఎక్స్ ప్రొఫైల్‌పైకి వెళ్లింది. కానీ అక్కడ
Twitter honours Manu Bhaker after India’s star shooter won bronze medal in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics)లో భారత్‌కు వరుసగా రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మను బాకర్(Manu Bhaker)కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు మనూ రెండు పతకాలను సాధించి భారత క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ అద్భుతాలు చేస్తుందని తొలి నుంచి క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మను భాకర్ రెండు పతకాలతో సత్తా చాటగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పలువురు ప్రముఖులు మనూ బాకర్ అద్భుతం చేసిందంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనూ బాకర్‌కు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతున్న వేళ.. అందరి దృష్టిని మనూ బాకర్ సోషల్ మీడియా ఎక్స్‌లోని ప్రొఫైల్ ఆకర్షించింది.
ఇంతకీ మనూ ఎక్స్ ఫ్రొఫైల్లో ఏముంది..?
మనూ బాకర్ ఎక్స్ అకౌంట్‌లోని ప్రొఫైల్‌లో బ్లూ టిక్‌తో పాటు ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరూ ఆ బ్యాడ్జ్ అంటే ఏంటి...? ఆ బ్యాడ్జ్ ఎలా వస్తుంది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మను భాకర్ X అకౌంట్‌లో ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ కనిపిస్తోంది. పసుపు రంగు వృత్తాకారంలో నలుపు రంగులో ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ మెరిసిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం సాధించిన ప్రతి ఒక్కరికి వారి ఎక్స్ ఖాతా ప్రొఫైల్‌లో ఈ బ్యాడ్జ్‌ను ఇస్తున్నారు. అలాగే మను భాకర్ కూడా ఈఫిల్ టవర్ బ్యాడ్జ్ అందుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను భాకర్ వ్యక్తిగత కాంస్య పతకాన్ని గెలుచుకోగా... మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ మరో కాంస్యాన్ని సాధించింది. ఈ పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని.... ఈ పతకం కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానని మనూ బాకర్ తెలిపింది.
VIDEO OF THE DAY. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) July 30, 2024
Manu Bhaker & Sarabjot Singh receiving the Bronze Medal in Paris Olympics 🥉 pic.twitter.com/dsQryZMqYk
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
ఓటీటీ-వెబ్‌సిరీస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion