Bhavinavben Wins Silver: రజతం సాధించిన భవీనాబెన్.. టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓటమి
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ రజత పతకం కైవసం చేసుకుంది.
![Bhavinavben Wins Silver: రజతం సాధించిన భవీనాబెన్.. టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓటమి Tokyo Paralympics 2020 India Bhavinaben Patel Takes Home Silver Loses China Table Tennis Final Bhavinavben Wins Silver: రజతం సాధించిన భవీనాబెన్.. టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓటమి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/29/10ac9ebdd6a8bfe0120b08350824c2b3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారిణికి రజత పతకం వరించింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయిన భవీనా బెన్ పటేల్.. చైనాకు చెందిన క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ సీడ్ అయిన యింగ్ జావోతో కలిసి తలపడిన ఫైనల్ పోరులో 3-0తో ఓటమి పాలయింది. దీంతో భవీనాబెన్ రజత పతకం కైవసం చేసుకుంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే.. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్ క్రీడలో భారత దేశానికి ఒక పతకం రావడం ఇదే మొదటిసారి.
భవీనా బెన్ పటేల్ గుజరాత్‌కి చెందిన క్రీడాకారిణి. పోలియో ఆమె చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. మొదట్లో ఫిట్‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడడాన్ని భవీనా అలవాటు చేసుకుంది. ఆ తర్వాత దాన్నే కెరీర్‌గా ఎంపిక చేసుకొని ఆ దిశగానే సాధన చేసింది. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకుంది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా భవీనా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మలిక్ రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
గుజరాత్‌లోని మెహసానాకు చెందిన భవీనా బెన్ పటేల్ అయిదేళ్ల కిందటే అంటే 2016 రియో పారాలింపిక్స్‌కు ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా భవీనా పట్టుదల వీడకుండా టోక్యోలో అడుగుపెట్టింది. ఇక్కడ తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఆమె ఆత్మవిశ్వాసం వీడలేదు. మధ్యతరగతి కుటుంబంలో భవీనా పోలియో కారణంగా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులందరూ గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది.
భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అక్కడే ఆమె టేబుల్ టెన్నిస్ కెరీర్‌కు నాంది పడింది. ఫిట్‌నెస్ కోసం సరదాగా ఆట ఆడడం మొదలు పెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.
A #Silver medal #IND will remember ❤️
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021
Bhavina Patel's incredible #Paralympics campaign ends with a podium finish as she loses out to #CHN's Zhou Ying 11-7, 11-5, 11-6 in her Class 4 #ParaTableTennis final! 🏆
Thank you for the moments 😃 pic.twitter.com/j8GcnHDtDL
#Paralympics debut ✅#IND's first #ParaTableTennis medal ✅
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021
Bhavina Patel's maiden appearance ends with a #Silver medal! #Tokyo2020pic.twitter.com/tINiLxkRL0
#GOLD MEDAL MATCH COMING UP ‼️
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021
Bhavina Patel will take on #CHN's Zhou Ying in the #ParaTableTennis final that's about to begin very soon! ⏰
Will she bag #IND's first medal at the #Paralympics? Leave your thoughts below! #Tokyo2020 https://t.co/PaJMd4sZZK
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)