అన్వేషించండి

Avani Lekhara Wins Bronze: అవని లేఖరా ఖాతాలో మరో పతకం.. కాంస్యం సాధించిన భారత షూటర్

పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖరా మరో పతకాన్ని సాధించారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు.

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖరా మరో పతకాన్ని సాధించారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ సోమవారం షూటింగ్ విభాగంలో అవని లేఖరా బంగారు పతకం సాధించడం తెలిసిందే. అయితే, పారాలింపిక్స్‌లో ఓ భారత మహిళ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్‌లో అవని లేఖరా బంగారు పతకం గెలిచి పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పారు. తాజాగా 50 మీటర్ల విభాగంలో కాంస్యం నెగ్గడం ద్వారా ఈ పారాలింపిక్స్ ద్వారా జైపూర్‌కు చెందిన అవని లేఖరా రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళ అవని కాగా.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన తొలి భారత అథ్లెట్‌గా ఆమె నిలిచారు.

Also Read: Praveen Kumar Wins Silver Medal: భారత్ ఖాతాలో మరో పతకం.. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం

పారాలింపియన్, భారత షూటర్ అవని లేఖరా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు నెగ్గడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవని లేఖరా అద్భుత ప్రదర్శన చేసి మరో పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్యం సాధించిన అవనికి అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. షూటర్ అవనీ కాంప్య పతకంతో కలిపితే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. భారత్ రెండు బంగారు పతకాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కొనసాగుతోంది.

Also Read: IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన తొలి రోజు ఆట... ఇంగ్లాండ్ 53/3 ... భారత్ 191 ఆలౌట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget