By: ABP Desam | Updated at : 03 Sep 2021 09:23 AM (IST)
ప్రవీణ్ కుమార్
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో నిన్న భారత్‌కు పతకాలేవీ రాలేదు. అయితే నేటి ఉదయం నుంచే భారత్ పతకాలలో బోణీ కొట్టింది. భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజతం సాధించాడు. పురుషుల హై జంప్ టీ64 విభాగం ఫైనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
స్వర్ణం కోసం జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోనాథన్ ఎడ్‌వర్డ్స్ 2.10 మీటర్లు జంప్ చేయగా.. భారత్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ప్రవీణ్ సాధించిన సిల్వర్ మెడల్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. భారత్ రెండు బంగారు పతకాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరుగైన ప్రదర్వన చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Also Read: IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన తొలి రోజు ఆట... ఇంగ్లాండ్ 53/3 ... భారత్ 191 ఆలౌట్
#TokyoParalympics, Men's High Jump (T64): Praveen Kumar (Sport Class T44) wins silver medal pic.twitter.com/PqAEmctnpo
— ANI (@ANI) September 3, 2021
పారాలింపిక్స్ 2020లో సిల్వర్ మెడల్ సాధించిన హై జంపర్ అథ్లెట్ ప్రవీణ్ కుమర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అతడి కఠోర శ్రమ, నిబద్ధతకు నిదర్శనం ఈ పతకమని కొనియాడారు. ప్రవీణ్ కుమార్‌ను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ అతడు మరెన్నో పతకాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021
భారత అథ్లెట్లు నేడు పాల్గొంటున్న విభాగాల వివరాలు ఇవే...
You thought today's schedule was action packed?
— SAI Media (@Media_SAI) September 2, 2021
Wait till you check out the schedule for 3️⃣ Sept 😉
Keep your energy levels high & rolling and continue cheering for 🇮🇳 as the Tokyo #Paralympics nears its end
Take a look & don't forget to set your 🕠#Cheer4India #Praise4Para pic.twitter.com/uBoPKPpgEE
Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - 2028లో కూడా!
డోపింగ్ టెస్ట్ అంటే ఏమిటి.? ఈ టెస్ట్ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?
Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే
Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు