అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: భారత అథ్లెట్ల శిక్షణ కోసం కోట్లకు కోట్లు, ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Olympic Games Paris 2024: విశ్వక్రీడల్లో భారత్ తరఫున సత్తాచాటి పతకాలు తీసుకొచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.
Indias trip to Paris Olympics to cost Rs 33.68 crore: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)కు సర్వం సిద్ధమైంది. పతకాల వేటకు భారత బృందం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించి సత్తా చాటాలని అథ్లెట్లు పట్టుదలతో ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 16 ఈవెంట్లలో పాల్గొంటోంది. అయితే ఈ ఒలింపిక్స్‌కు అథ్లెట్లను సిద్ధం చేసేందుకు... వారికి శిక్షణ ఇచ్చేందుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ భారీగా ఖర్చు పెట్టింది.వాటి వివరాలపై ఓ లుక్కేద్దామా..?
నీరజ్ చోప్రా(Neeraj Chopra)
గత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతో మెరిసిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా..ఈ ఏడాది కూడా పతకంపై కన్నేశాడు. దీని కోసం నీరజ్ చోప్రా పాటియాల లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు... యూరప్‌లో శిక్షణ పొందాడు. నీరజ్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 5.72 కోట్లు ఖర్చు పెట్టింది. పారిస్‌లో నీరజ్ మరో స్వర్ణం కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు.
మెన్స్ హాకీ జట్టు (Mens hockey Team)
టోక్యోలో కాంస్య పతకంతో 41 సంవత్సరాల ఒలింపిక్ పతక ఎదురుచూపులకు తెరదించిన భారత పురుషుల హాకీ జట్టు...ఈ విశ్వ క్రీడల్లోనూ పతకంపై కన్నేసింది. హాకీ జట్టు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందారు. హాకీ జట్టుపై క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 41.81 కోట్లు ఖర్చు పెట్టింది.
సాత్విక్‌సాయిరాజ్ -చిరాగ్ శెట్టి
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ సాత్విక్‌సాయిరాజ్ - చిరాగ్ శెట్టి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతూ స్వర్ణంపై కన్నేశారు. వీరు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 5.62 కోట్లు అందుకున్నారు.
పీవీ సింధు (P.v. Sindhu)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో రజతం, టోక్యో 2020లో కాంస్యం సాధించింది. ఈసారి స్వర్ణంపై గురిపెట్టింది. బెంగళూరులోని ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. సింధు శిక్షణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 3.13 కోట్లు అందుకుంది.
మీరాబాయి చాను
టోక్యోలో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను.. రూ. 2.74 కోట్లు అందుకుంది. పాటియాలాలోని సాయ్‌లో శిక్షణ పొందుతోంది.
మను భాకర్
షూటింగ్ స్టార్ మను భాకర్ పారిస్‌లో పతకం తెస్తుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. క్రీడా మంత్రిత్వ శాఖ ఈ స్టార్ శిక్షణ కోసంరూ. 1.68 కోట్లు ఖర్చు పెట్టింది.
రోహన్ బోపన్న
44 ఏళ్ల రోహన్ బోపన్న శిక్షణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1.56 కోట్లు అందుకున్నాడు.
మనిక బత్రా
టేబుల్ టెన్నిస్‌లో అంచనాలు ఉన్న మనిక బత్రా క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి శిక్షణ కోసం రూ. 1.30 కోట్లు అందుకుంది.
నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్
నిఖత్ జరీన్‌కు రూ. 91.71 లక్షలు, లవ్లీనాకు రూ. 81.76 లక్షల రూపాయలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శిక్షణ కోసం ఇచ్చింది.
వినేష్ ఫోగట్
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ శిక్షణ కోసం కేంద్రం రూ. 70.45 లక్షలు అందజేసింది.
జట్లుగా కేటాయింపులు ఇలా...
ఆర్చరీ జట్టు : రూ. 39.18 కోట్లు
అథ్లెటిక్స్: రూ. 96.08 కోట్లు
బ్యాడ్మింటన్: రూ 72.03 కోట్లు
బాక్సింగ్: రూ. 60.93 కోట్లు
ఈక్వెస్ట్రియన్: రూ. 95.42 లక్షలు
గోల్ఫ్: రూ. 1.74 కోట్లు
హాకీ: రూ. 41.30 కోట్లు
జూడో: రూ. 6.33 కోట్లు
రోయింగ్: రూ. 3.89 కోట్లు
సెయిలింగ్: రూ. 3.78 కోట్లు
షూటింగ్: రూ. 60.42 కోట్లు
స్విమ్మింగ్: రూ. 3.90 కోట్లు
టేబుల్ టెన్నిస్: రూ. 12.92 కోట్లు
టెన్నిస్: రూ. 1.67 కోట్లు
వెయిట్ లిఫ్టింగ్: రూ. 27 కోట్లు
రెజ్లింగ్: రూ. 37.80 కోట్లు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement