అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: నేడు మరో పతకం ఖాయమేనా?, ఇవాళ్టీ భారత షెడ్యూల్ ఇదే
Olympic Games Paris 2024: మూడో రోజు భారత్‌కు షూటింగ్‌లో మరిన్ని పతకాలు వస్తాయన్నఅంచనా ఉంది. నేడు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్‌లో రమితా జిందాల్, పురుషుల ఫైనల్‌లో అర్జున్ బాబుటా బరిలో ఉన్నారు.
Paris Olympics 2024 Day 3 India Full Schedule: పారిల్ ఒలింపిక్స్( Paris Olympics 2024)లో మను బాకర్ అందించిన స్ఫూర్తితో భారత్ నేడు బరిలోకి దిగనుంది. నిన్న( ఆదివారం) జరిగిన మ్యాచుల్లో స్టార్ అథ్లెట్లు అందరూ ముందడుగు వేసినా కొన్ని క్రీడాంశాల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇవాళ షూటింగ్‌లో మరో పతకం భారత ఖాతాలో చేరుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఇవాళ భారత షెడ్యూల్ ఎలా ఉందంటే...
ఇవాళ భారత షెడ్యూల్ ఇలా...
ఆర్చరీ
మెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్:
తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ – (సాయంత్రం 6:30)
బ్యాడ్మింటన్….
పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి
(మధ్యాహ్నం 12 గంటలకు)
మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): అశ్విని పొన్నప్ప -తనీషా (మధ్యాహ్నం 12.50 గంటలకు)
పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): లక్ష్య సేన్ vs జూలియన్ క్యారేజీ (బెల్జియం) – (సాయంత్రం 5:30)
షూటింగ్….
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్: రమితా జిన్ ( మధ్యాహ్నం 3 గంటలకు)
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్: అర్జున్ బాబుటా ( మధ్యాహ్నం 3.30కు)
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్: మను భాకర్ & సరబ్‌జోత్ సింగ్, రిథమ్ సాంగ్వాన్ & అర్జున్ సింగ్ చీమా – (మధ్యాహ్నం 12:45)
పురుషుల ట్రాప్ అర్హత: పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 1:00 గంటలు
హాకీ…
పురుషుల పూల్ B మ్యాచ్: భారత్ vs అర్జెంటీనా (సాయంత్రం 4:15 PM)
టేబుల్ టెన్నిస్…
మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 32): శ్రీజ అకుల vs జియాన్ జెంగ్( రాత్రి 11.30కు)
హాకీ జట్టుకు సవాల్
ఇవాళ భారత హాకీ జట్టుకు పెను సవాల్ ఎదురుకానుంది. పటిష్టమైన అర్జెంటీనాతో టీమిండియా తలపడనుంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇవాళ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే భారత్ పతకం దిశగా మరో అడుగు ముందుకు వేయనుంది. మరోవైపు షూటింగ్‌లోనూ భారత్‌కు ఇవాళ మరో పతకం వచ్చే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్‌లో రమితా జిందాల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్‌లో తలపడనున్నారు. వీరిద్దరిలో ఎవరి గురి కుదిరినా భారత్‌కు పతకం దక్కడం ఖాయం. ఈరోజు భారత పతకాల సంఖ్య పెరిగితే అది క్రీడాభిమానుల్లో జోష్‌ను నింపనుంది.
Also Read: చరిత్ర సృష్టించిన మను భాకర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion