అన్వేషించండి

Paris Olympics 2024: మరో పతకం ఖాయమయ్యేనా?, ఒలింపిక్స్‌లో నేడు కీలక సమరాలు

Olympic Games Paris 2024: ఇప్పటికే విశ్వ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ సెమీస్‌ చేరిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌ ఈరోజు సెమీస్‌ ఆడనున్నాడు. మరోవైపు భారత హాకీ టీమ్‌ బరిలో దిగనుంది.

Paris 2024 Olympics, Day 9, India  schedule: ఒలింపిక్స్‌(Paris 2024 Olympics)లో భారత్‌(India) ఇవాళ కీలక మ్యాచ్‌లను ఆడనుంది. అన్ని కుదిరితే భారత్‌కు ఇవాళ మరో పతకం ఖరారు కానుంది. ఈ ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో అలరిస్తున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ లక్ష్యసేన్‌ నేడు సెమీఫైనల్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే విశ్వ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ సెమీస్‌ చేరిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌... ఇప్పుడు పతకం కూడా నెగ్గి తన పేరును అంతర్జాతీయ క్రీడా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సెమీఫైనల్లో బలమైన ప్రత్యర్థే ఉన్నా లక్ష్య... అవకాశాన్ని వదిలేందుకు సిద్ధంగా లేడు. ఇప్పటికే ప్రపంచ నాలుగో నెంబర్‌కు షాక్ ఇచ్చి మరీ సెమీస్‌ వచ్చిన లక్ష్యసేన్‌...సెమీస్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నాడు. 

హాకీ జట్టు కూడా...
మరోవైపు భారత హాకీ టీమ్‌ కూడా నేడు పతక అవకాశాలను పరీక్షించుకోనుంది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా హాకీ టీమ్‌... గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి మంచి ఫామ్‌లో కనిపిస్తున్న ఇండియా హాకీ జట్టు... ఇప్పుడు బ్రిటన్‌కు కూడా షాక్‌ ఇచ్చి సెమీస్‌ చేరి పతక పోరు ఆడాలని భావిస్తోంది.  ఇక అథ్లెటిక్స్‌లోనూ భారత పోరు నేడు ఆరంభం కానుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్‌ నేడు బరిలోకి దిగనుంది. లవ్లీనా పతకం తెస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ గెలిస్తే లవ్లీనా సెమీస్‌లోకి దూసుకెళ్లి పతక పోరుకు సిద్ధం కానుంది.

ఇవాళ్టీ భారత షెడ్యూల్‌
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 (శుభంకర్ శర్మ -గగన్‌జీత్ భుల్లర్)- 12:30 PM

షూటింగ్
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్-స్టేజ్ 1 (విజయ్‌వీర్ సిద్ధూ -అనీష్) -  12:30 PM
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్-స్టేజ్ 2 (విజయ్‌వీర్ సిద్ధూ-అనీష్)- 4:30 PM 
మహిళల స్కీట్ క్వాలిఫికేషన్‌ - (మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్)- 1 PM: 
మహిళల స్కీట్ ఫైనల్‌( అర్హత సాధిస్తే)- (మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్_7 PM

హాకీ 
పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌ ‍(భారత్ vs గ్రేట్ బ్రిటన్)-1:30 PM

అథ్లెటిక్స్‌ 
మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్‌ (పరుల్ చౌదరి)-1:35 PM
పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్‌  (జెస్విన్ ఆల్డ్రిన్)-2:30 PM

 బాక్సింగ్
మహిళల 75 కేజీల క్వార్టర్‌ఫైనల్స్‌  ‍(లవ్లీనా బోర్గోహైన్ vs లి కియాన్‌)- 3:02 PM

బ్యాడ్మింటన్ 
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌ లక్ష్య సేన్ vs విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) 3:30PM

సెయిలింగ్
పురుషుల డింగీ రేస్ 7 అండ్‌ 8-‍(విష్ణు శరవణన్) 3:35 PM 
మహిళల డింగీ రేస్ 7 అండ్‌ 8 (నేత్ర కుమనన్)- 6:05 PM 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget