Shocking: ఇదేందయ్యా ఇది.. ఒలింపిక్ పతకాలకు తుప్పు, నాసిరకం మెడల్స్ సరఫరాపై నాలిక కరుచుకున్న నిర్వాహకులు
ఒలింపిక్ పతక విలువను తగ్గించేలా పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రవర్తించారు. నాసిరకం మెడల్స్ తో ఐఓసీ పరువు తీశారు. ఇప్పుడు నష్ట నివారణకు దిగారు.దీనిపై ప్లేయర్లు, క్రీడాభిమానులు ఫైరవుతున్నారు.
Rust On Olympic Medals: ఒలింపిక్ మెడల్ అంటే ఎంతో ప్రత్యేకమో మనకు తెలియనిది కాదు. జీవితకాలంలో కనీసం ఒక్క పతకమైన సాధించాలని ఎంతోమంది ప్లేయర్లు కలలు కంటుంటారు. ఇక భారత్ కు సంబంధించి, చాలాఎడిషన్లలో సింగిల్ డిజిట్ లోనే పతకాలు వస్తున్నాయి. పక్కదేశమైన చైనా, క్వింటాళ్ల కొద్ది పతకాలు సాధిస్తుంటే, మనమేమో ఒక్క పతకం సాధించిన అపూర్వమని భావిస్తుంటాం. పతకం సాధించిన ప్లేయర్లకు కనకవర్షం కురిపిస్తాం. 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు పతకాలు వచ్చాయి. అందులో ఒక సిల్వర్, ఐదు రజత పతాలకు కావడం గమనార్హం. అయితే తమక ఇచ్చిన పతకాలు తుప్పు పడుతున్నాయని, రంగు వెలిసి పోతున్నాయని భారత ప్లేయర్లు కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా డబుల్ ఒలింపిక్ మెడల్ విన్నర్ మనూ భాకర్, తనకిచ్చిన రెండు పతకాలు ఖరాబ్ అయ్యాయని కంప్లైంట్ చేసింది. రంగు వెలిసి పోయాయని వాపోయింది. ఇలాంటి ఫిర్యదులు బాగా రావడంతో నష్ట నివారణ చర్యలకు అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సీల్ (ఐఓసీ) దిగింది.
నిషేధిత పదార్థమే దీనికి కారణమా..?
నిజానికి పారిస్ లోని కాయిన్ల ముద్రణాలయం, మింట్.. ఒలింపిక్ పతకాలను ముద్రించిందని తెలుస్తోంది. అయితే ఈసారి కొత్తగా నిబంధనలు రూపొందించారు. వార్నిష్ కు సంబంధించి ఒక పదార్థాన్ని వాడకపోవడంతో పతకాలు రంగు వెలిసి, తుప్పు పట్టి పోతున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి పతకాల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తలపట్టుకున్న ఐఓసీ.. 2024 పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల కమిటీకి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాడై పోయిన పతకాల స్థానంలో త్వరలో కొత్తవి అందిస్తామని సదరు కమిటీ చావు కబురు చల్లగా చెప్పింది. అలాగే ఫిర్యాదు దారుల సంఖ్యను బట్టి, సీరియల్ నెంబర్ ప్రకారం కొత్త పతకం అందిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే పతకాలు సాధించిన ఆటగాళ్లు తమ మెడల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించుకుని, ఏవైనా లోపాలుంటే నిర్వాహకులకు ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు.
షూటింగ్ లోనే అత్యధిక పతకాలు..
గత ఏడాది భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత్.. కేవలం ఆరు పతకాలకే పరిమితమైంది. ముఖ్యంగా షూటింగ్లోనే మూడు పతకాలు రావడం విశేషం. వ్యక్తిగత విభాగంతోపాటు సరబ్జోత్ తో కలిసి మనూ భాకర్ రెండు పతకాలు సాధించింది. స్వాతంత్ర భారతవనిలో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా మనూ నిలిచింది. అలాగే స్వప్ని్ కుసాలే కు కూడా కాంస్య పతకం దక్కింది. మరోవైపు రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రవత్ కు కాంస్య పతకం లభించింది. ఇక జావెలిన్ త్రోలో హాట్ ఫేవరెట్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.
గోల్డ్ మెడల్ సాధిస్తాడని అభిమానులు ఆశించిన వెండి పతకంతో సంతృప్తి పొందాడు. మరోవైపు పురుషుల హాకీలో వరుసగా రెండోసారి భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తానికి ఆరు పతకాలు సాధించినట్లయ్యింది. ఇక రెజ్లింగ్ లో వినేశ్ ఫోగట్.. ఫైనల్ కు చేరినా, అధిక బరువు కారణంగా డిస్ క్వాలిఫై అయ్యింది. దీంతో భారత అభిమానులు షాక్ తిన్నారు. ఏదేమైనా వచ్చే టోర్నీలో అయినా డబుల్ డిజిట్ లో ఒలింపిక్స్ మెడల్స్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.