Paralympic 2020: సత్తా చాటిన భారత క్రీడాకారులు.. జావెలిన్ త్రోలో ఒకేరోజు రెండు పతకాలతో రికార్డు
ఇవాళ (ఆగస్టు 30) ఏకంగా నలుగురు క్రీడాకారులు పతకాలతో మెరిశారు. జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు దక్కాయి.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. సోమవారం భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చి పతకాలను సొంతం చేసుకున్నారు. ఇవాళ ఏకంగా నలుగురు క్రీడాకారులు పతకాలతో మెరిశారు. జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం సొంతం చేసుకోగా.. సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. డిస్కస్‌త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సొంతం చేసుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే అవని లేఖరా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
డిస్కస్‌త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కతునియా రజతం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు డిస్క్‌ను విసిరి బంగారు పతకం సాధించగా.. యోగేశ్ కతునియా 44.38 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ గెల్చుకున్నాడు. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖరా స్వర్ణం సాధించగా.. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కింది. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఓ స్వర్ణం, మూడు రజత పతకాలు ఉన్నాయి. ఆదివారం హైజంప్‌లో నిషాద్, టేబుల్ టెన్నిస్‌లో భవీనా బెన్ సిల్వర్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.
2⃣ Indians sharing the podium - you love to see it 😍#IND continue their medal-winning run with #Silver for @DevJhajharia and #Bronze for @SundarSGurjar in the Men's Javelin Throw F46 final. 🙌#Tokyo2020 #Paralympics #ParaAthleticspic.twitter.com/P9DBROJ4Zj
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 30, 2021
Let's 'discus' this #silver medal-winning throw 😉
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 30, 2021
Watch #IND's Yogesh Kathuniya's season-best throw of 44.38m which earned #IND another medal at the #Tokyo2020 #Paralympics❗👇#ParaAthleticspic.twitter.com/DkD5793ImC
Weather Update 🚨: It's RAINING medals for #IND 🌧️🥇🥈🏅
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 30, 2021
Devendra Jhajharia grabs #Silver and Sundar Singh Gurjar claims #Bronze as India dominate the podium in the Men's Javelin Throw F46 Final taking India's tally to 7️⃣! 🔥#Tokyo2020 #Paralympics #ParaAthletics
#IND's national anthem echoes across the arena as Avani Lekhara grabs a historic #Gold for her nation! 💪#Tokyo2020 #Paralympics #ShootingParaSport @AvaniLekharapic.twitter.com/Agv5Wptrfi
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 30, 2021