అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో వివాదాలు, విచిత్రాలు- డ్రగ్స్ కేసు నుంచి పోర్న్ సినిమాల్లో అవకాశాల దాకా
Olympic Games Paris 2024: ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడలు, పతకాలతో పాటు అనేక వివాదాలు కనిపించాయి. తొలిరోజే జరిగిన ఓపెనింగ్ వేడుక మొదలుకొని లింగ అర్హత వరకు..
పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)ను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. లింగ అర్హత, డ్రగ్స్, యాంటీ సెక్స్ బెడ్‌లు, బాక్సింగ్ పాయింట్లు ఇలా ఎన్నో వివాదాలు విశ్వ క్రీడల్లో జరిగాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే...
డ్రగ్స్ కొనేందుకు యత్నించి హాకీ ప్లేయర్ అరెస్ట్...
డ్రగ్స్ కొనేందుకు యత్నించిన ఆస్ట్రేలియ హాకీ జట్టు ఆటగాడు టామ్ క్రెయిగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రెయిగ్‌ను విచారణ కోసం యాంటీ డ్రగ్ విభాగానికి అప్పగించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనపై క్రెయిగ్ క్షణాపణలు చెప్పాడు. తాను ఘోరమైన తప్పు చేశానని... తన చర్యకు పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపాడు.
లైంగిక వేధింపులు కూడా...
లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఒలింపిక్ రెజ్లర్ మొహమ్మద్ ఇబ్రహీంను అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. మొహమ్మూద్ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. పారిస్ కేఫ్ వెలుపల వెనుక నుంచి ఒక మహిళను పట్టుకున్నందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. స్వదేశానికి వెళ్లే కొద్ది గంటల ముందు మొహమ్మూద్ ఈ పని చేశాడు.
స్విమ్మర్ బహిష్కరణ
ఒలింపిక్ విలేజ్ నుంచి అందంగా ఉందన్న కారణంతో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను పంపించేయడం కూడా వివాదం రేపింది. ఆమె అందం కారణంగానే బయటకు పంపిచారనే ప్రచారం జరిగింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందన్న కారణంతో అలోన్సోను స్వదేశానికి పంపించేశారు. ఆమె పరాగ్వే జట్టులో అనుచితమైన వాతావరణాన్ని సృష్టించిందని పరాగ్వే ఒలింపిక్ కమిటీ వెల్లడించింది.
జననాంగమే శాపమైంది...
పారిస్ ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్‌కు ఊహించని విధంగా ఓటమి ఎదురైంది. పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో పురుషాంగం తగిలి... ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనీ అమ్మిరాటికి పతకం చేజారింది. జంప్ చేస్తున్నప్పుడు జననాంగం పోల్‌కు తగిలడంతో అతను నాలుగో స్తానంలో నిలిచాడు. అయితే ఇదే ఇప్పుడు అంధోనీకి పోర్న్ సినిమాల్లో బోలెడు ఆఫర్లను తెచ్చిపెట్టింది. పోర్న్ సినిమాల్లో నటిస్తే 2, 50,000 డాలర్లు ఇస్తామని కూడా అంథోనీకి ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే అతడు దానికి పెద్గగా ఇంట్రెస్ట్ చూపలేదు.
లింగ అర్హతపై వివాదం
ఈ ఒలింపిక్స్‌లో లింగ అర్హత వివాదం తీవ్ర కలకలం రేపింది. సాక్షాత్తూ ఇటలీ ప్రధాని మెలోని కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. మహిళల కుస్తీల్లోకి ఎక్స్, వై క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్లను ఎలా అనుమదిస్తారని చాలామంది ప్రశ్నించారు. ఇమానే ఖలీఫ్ ఉదంతం అయితే కొన్నిరోజులపాటు క్రీడా ప్రపంచాన్ని ఊపేసింది.
లాస్ట్ సప్పర్ వివాదం
ఒలింపిక్ ఆరంభ వేడుకల్లో లాస్ట్ సప్పర్ పేరడిపైనా వివాదం చెలరేగింది. ట్రంప్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒలింపిక్ నిర్వహణ కమిటీ క్షమాపణలు కూడా చెప్పింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
అమరావతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement