Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. శుక్రవారం రోజు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికీ 288 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనలో ఏపీకి చెందిన వాళ్లే 50 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగతున్నాయి. ఈక్రమంలోనే రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. సంతాపం తెలుపుతున్నారు.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి తాను చాలా బాధపడినట్లు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వవరించారు.
So saddened to hear about the devastating train accident in Odhisa . My thoughts and prayers with the people and their families .strength and prayers 🙏🏽
— Sania Mirza (@MirzaSania) June 3, 2023
ఒడిసాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ओडिशा के बालासोर में हुए दर्दनाक रेल हादसे में 200 से अधिक यात्रियों के असमय निधन का ह्रदय विदारक समाचार मिला है।
— Babita Phogat (@BabitaPhogat) June 3, 2023
ईश्वर दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान प्रदान करें एवं घायलों के शीघ्र स्वास्थ्य लाभ प्रदान करे।
||ॐ शांति||#BalasoreTrainAccident #Balasore #Odisha pic.twitter.com/YSyzOms3y6
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన బాధాకరమైన రైలు ప్రమాదంలో 200 మందికి పైగా ప్రయాణికులు అకాల మరణం చెందారనే వార్త తనను ఎంతగానో బాధించిందని రెజ్లర్ బబిత ఫోగట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈమెతో పాటు నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా కూడా తమ సంతాపాన్ని తెలిపారు.
Woke up to read the news of the horrific tragedy in Odisha. My thoughts and prayers are with the friends and families of everyone affected. Om shanti. 🙏🏻
— Neeraj Chopra (@Neeraj_chopra1) June 3, 2023
ఒడిశాలో జరిగిన ఘోర విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు అభినవ్ బింద్రా తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఈ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.
Heartbreaking news from Odisha about the devastating train accident. My heart goes out to all those affected and their loved ones during this incredibly difficult time. Please, let's all extend our support and prayers to them. May the injured recover swiftly.
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) June 3, 2023