Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
Telangana News | ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతున్న వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని నిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Food Poision Student Dies at NIMS Hospital | కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ నివాసంలో పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ మృతిచెంది. ఆమె కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తున్న.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీనీ బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇది పోలీసుల దౌర్జన్యం అంటూ బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు యత్నిస్తున్నారంటూ ముందస్తుగానే ఈ హౌస్ అరెస్టు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసిఫాబాద్ తుడుము దెబ్బ జిల్లా నాయకుల అరెస్టు ఆ ప్రజాస్వామికం
వాంకిడి మండలంలో కొమరం భీమ్ చౌక్ వద్ద ఉన్న తుడుం దెబ్బ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన శైలజ అనే విద్యార్థిని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఫుడ్ పాయిజన్ కు గురైన బాలిక ఆశ్రమ పాఠశాల యాజమాన్యం, అధికారులు, ప్రభుత్వ వైఫల్యం వలన మృతి చెందిందన్నారు తుడుం దెబ్బ నాయకులు. ఆమె కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యగం కల్పించాలి అని శాంతియుతంగా నిరసన నిర్వహించారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగం జోక్యం చేసుకొని అక్రమంగా ఆ ప్రజాస్వామికంగా అక్కడున్నటువంటి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కాగాజ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం సబబు కాదన్నారు. వారిని వెంటనే విడుదల చేయకుంటే ఉమ్మడి జిల్లాల కమిటీ తీవ్ర నిరసనకు దిగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ హెచ్చరించింది.
Also Read: Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
అసలేం జరిగిందంటే..