అన్వేషించండి

Rahul Ravindran: మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌

Chunni Girl Controversy: 'ది గర్ల్ ఫ్రెండ్' చూశాక ఓ అమ్మాయి చున్నీ తీసి వేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. తర్వాత ఆ అమ్మాయి సక్సెస్ మీట్ కి వచ్చింది. ఆమెపై రాహుల్ రవీంద్రన్ స్పందించారు.

'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా (The Girlfriend Movie) మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రదర్శన తరువాత ఓ అమ్మాయి రాహుల్ రవీంద్రన్‌ (Rahul Ravindran)తో సంతోషాన్ని పంచుకుంది. ఈ చిత్రాన్ని చూసిన తరువాత తనకు కూడా ధైర్యంగా చున్నీ తీసేసి తన అభిప్రాయాల్ని చెప్పాలని ఉందని అంటూ... చున్నీని తీసి పడేసింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రోలింగ్ అయింది. ఆ అమ్మాయి ఎప్పుడూ చున్నీ వేసుకున్నట్టు బిల్డప్ ఇస్తోందని... అసలు ఆమె ఇన్ స్టా రీల్ చూస్తే అసలు విషయం తెలుస్తుందని, సినిమా కోసమే అలా వేసుకుని వచ్చిందని, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

పీఆర్ స్టంట్ కాదు... ఖండించిన రాహుల్!
సదరు అమ్మాయి మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని రాహుల్ రవీంద్రన్ ఖండించాడు. ఈ మేరకు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ... ''అసలు ఈ విషయం మీద నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ ఈ ట్రోలింగ్ మరీ శృతి మించిపోతోంది. ఆ అమ్మాయిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏ థియేటర్‌కి ఎక్కడికి వెళ్తాం. థియేటర్లో ఎవరు ఉంటారు? అన్నది మాకు ఐడియా లేదు... అదంతా పీఆర్ స్టంట్ కాదు... ఆ అమ్మాయి సినిమా చూసి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పింది.

Also Read'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?

ఆ తరువాత వెంటనే మేం మళ్లీ వేరే థియేటర్‌కు వెళ్లాం. ఆ అమ్మాయికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ వీడియో పోస్ట్ చేసుకోవచ్చని మా టీం నాతో చెప్పింది. అసలు ఈ సినిమా చున్నీ వేసుకోమని గానీ వేసుకోవద్దని గానీ చెప్పడానికి తీయలేదు.. వేసుకోవాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభిప్రాయం.. ఈ ఘటన మన అందరినీ మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెబుతుంది.. ఓ అమ్మాయి తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో సింబాలిక్‌గా చున్నీ తీసేస్తే కొందరు మాత్రం తట్టుకోలేకపోతోన్నారు..

సినిమాల్లో హీరోలు ఫైట్ చేసే ముందు గుండీలు తీస్తారు.. ఆట గెలిస్తేనో.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లోనూ మగాళ్లు చొక్కాలు విప్పేస్తారు.. అవేవీ మీకు తప్పులుగా కనిపించవా?..  కానీ కల్చర్, సంప్రదాయం అని మహిళల మీదే ఎందుకు రుద్దుతారు.. మనలో ఎంత మంది నిత్యం ధోతిలను ధరిస్తారు? ఎందుకు ప్యాంట్లు వేసుకుంటున్నాం?.. మన భాష మీద అంత ప్రేమ ఉండే వాళ్లంతా ఇంగ్లీష్‌లో ఎందుకు ట్వీట్లు వేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉందా?.. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా ఇప్పటి ట్రెండ్, ఇప్పటి తరానికి అవసరం అని చాలా మంది నాతో అన్నారు.. అది ఎందుకో వీరి రియాక్షన్ చూస్తుంటేనే అర్థం అవుతోంది'' అని ట్వీట్ వేశారు.

Also Readకార్తీక దీపం సీరియ‌ల్ దర్శకుడితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా - అనౌన్స్‌ చేశారు కానీ...

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget