NZ vs AUS Final T20: ఆసీస్ x కివీస్.. ఎవరిది పైచేయి? ఫైనల్ ఎక్కడ? స్ట్రీమింగ్, ప్రసారం ఎందులో? టైమింగ్స్ ఏంటి?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆఖరి సమయంలో ఆసీస్, కివీస్ తలపడుతున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా కొత్త విజేతగా ఆవిర్భవిస్తారు. ఈ మ్యాచ్ టైమింగ్, వేదిక,స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. తమ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు కావడం.. నాణ్యమైన క్రికెట్ ఆడటంలో ముందుంటారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. వాస్తవంగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఫైనల్లో తలపడతాయని అంతా అంచనా వేశారు.
ఆ అంచనాలను ఆసీస్, కివీస్ తలకిందులు చేశాయి. భీకరమైన ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఆఖరి వరకు నమ్మకంగా ఆడిన జిమ్మీ నీషమ్ సెమీస్ గెలిపించేశాడు. ఇక పాక్‌పై ఆసీస్‌దీ అద్భుతమైన గెలుపే. భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేస్తున్న షాహిన్ అఫ్రిది వేసిన 19 ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని మాథ్యూవేడ్ సిక్సర్లుగా మలిచాడు. కంగారూలను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్ వేదిక ఏంటి? సమయం ఎప్పుడు? ఒకరిపై మరొకరి రికార్డులు ఏంటి? సంబంధిత వివరాల కోసం అభిమానులు శోధిస్తున్నారు.
ఎవరిది పైచేయి?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. న్యూజిలాండ్ 5, ఆస్ట్రేలియా 9 గెలిచాయి. స్పష్టమైన ఆధిక్యం కంగారూలకే ఉన్నా.. టీ20 ప్రపంచకప్పుల్లో తలపడ్డ ఒక మ్యాచులో కివీస్‌దే గెలుపు.
వాతావరణం ఎలా ఉంది?
ఈ రోజంతా దుబాయ్‌లో ఎండకాసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 26 నుంచి 29 డిగ్రీ మధ్య ఉండనుంది. క్రికెట్ ఆడేందుకు అనుకూలమైన వాతావరణమే ఉండనుంది.
వేదిక, మ్యాచ్ ఆరంభం?
భారత కాలమానం ప్రకారం నవంబర్ 14, ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. 7 గంటలకు టాస్ వేస్తారు. వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం.
ఏ టీవీ ఛానళ్లో మ్యాచ్ ప్రసారం అవుతుంది?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 1 హెచ్‌డీలో ప్రసారం అవుతుంది.
ఈ మ్యాచ్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో అవుతుంది.
ఈ మ్యాచ్ అంపైర్లు ఎవరు?
మారియస్ ఎరాస్మస్, రిచర్డ్ కెటిల్‌బొరో. మూడో అంపైర్: నితిన్ మేనన్
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి