అన్వేషించండి
Advertisement
NZ vs AUS Final T20: కివీస్, ఆసీస్ జాగ్రత్త మరి..! ఫైనల్ గెలిపించేదీ టాసే..! చరిత్ర చెబుతున్నది సత్యమిది..!
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టాస్, పవర్ ప్లే అత్యంత కీలకం కానున్నాయి. దుబాయ్ చరిత్ర చూస్తే ఇదే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచులే సాక్ష్యం!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడే! చిరకాల వన్డే శత్రువులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సాయంత్రం తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ కాబట్టి అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కఠినమైన ఈ పిచ్‌పై టాస్, పవర్‌ప్లే అత్యంత కీలకం కానున్నాయి. దాదాపుగా టాస్ గెలిచిన జట్లే విజయాలూ అందుకున్నాయి. లక్ష్య ఛేదనకు దిగిన జట్లకే పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు దుబాయ్‌లో 12 మ్యాచులు జరగ్గా ఏ జట్టు పవర్‌ప్లేలో ఎలా ఆడిందో చూద్దాం..!
- వెస్టిండీస్ x ఇంగ్లాండ్: ఆంగ్లేయులు ఛేదనకు దిగారు. ఆరు వికెట్ల తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ పవర్‌ప్లేలో 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 39/3 చేసింది.
- భారత్ x పాకిస్థాన్: పాక్ ఛేదనకు దిగింది. పది వికెట్ల తేడాతో గెలిచింది. పవర్‌ప్లేలో భారత్ 36/3తో నిలిస్తే పాక్ 43/0తో రాణించింది.
- వెస్టిండీస్ x దక్షిణాఫ్రికా: సఫారీలు రెండో బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లతో గెలిచారు. మొదట విండీస్ పవర్‌ప్లేలో 43/0తో ఉంటే దక్షిణాఫ్రికా 42/1తో నిలిచింది.
- శ్రీలంక x ఆస్ట్రేలియా: ఆసీస్ ఛేదన చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక పవర్‌ప్లేలో 53-1తో ఆసీస్ 63-0తో నిలిచాయి.
- అఫ్గానిస్థాన్ x పాకిస్థాన్: పాక్ రెండో బ్యాటింగ్ చేసి 5 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో అఫ్గాన్ 49-4, పాక్ 38-1తో నిలిచాయి.
- ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్: ఆంగ్లేయులు ఛేదనకు దిగి 8 వికెట్ల తేడాతో గెలిచారు. పవర్‌ప్లేలో ఆసీస్ 21-3, ఇంగ్లాండ్ 66-0తో నిలిచాయి.
- భారత్ x న్యూజిలాండ్: కివీస్ రెండో బ్యాటింగ్ చేసి 8 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో భారత్ 35-2, కివీస్ 44-1తో నిలిచాయి.
- న్యూజిలాండ్ x స్కాట్లాండ్: న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 16 పరుగులతో గెలిచింది. పవర్‌ప్లేలో కివీస్ 52-2, స్కాట్లాండ్ 48-1తో నిలిచాయి.
- బంగ్లాదేశ్ x ఆస్ట్రేలియా: ఆసీస్ రెండో బ్యాటింగ్ చేసి 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. పవర్‌ప్లేలో బంగ్లా 33-2, ఆసీస్ 67-2తో ఉన్నాయి.
- స్కాట్లాండ్ x భారత్: భారత్ ఛేదనకు దిగింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. పవర్‌ప్లేలో స్కాట్లాండ్ 27-2, ఇండియా 82-2తో నిలిచాయి.
- నమీబియా x భారత్: టీమ్‌ఇండియా ఛేదనకు దిగి 9 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో నమీబియా 34-2 చేస్తే భారత్ 54-0తో నిలిచింది.
- పాకిస్థాన్ x ఆస్ట్రేలియా: సెమీస్‌లో ఆసీస్ భారీ ఛేదనకు దిగి 5 వికెట్లతో విజయ దుందుభి మోగించింది. పవర్‌ప్లేలో పాక్ 47-0, ఆసీస్ 52-1తో నిలిచాయి.
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
బిజినెస్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement