T20 Worldcup 2021: మొదటి సారి సూపర్ 12కు క్వాలిఫై అయిన జట్టు ఇదే.. ఇక నుంచి అసలు సమరం!
టీ20 వరల్డ్‌కప్‌లో క్వాలిఫయర్ గ్రూప్-1 నుంచి శ్రీలంక, నమీబియా, క్వాలిఫయర్ గ్రూప్-2 నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ప్రధాన టోర్నీకి ఎంపికయ్యాయి. ఇక ప్రధాన టోర్నీ జరగనుంది.
టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాకు నేడు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఐర్లాండ్‌పై విజయంతో నమీబియా మొదటిసారి ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న నమీబియా ఈ టోర్నీలోనే అత్యంత తక్కువ ర్యాంకు ఉన్న టీం. ఐర్లాండ్‌పై 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నమీబియా విజయం సాధించింది. నమీబియా కెప్టెన్ డెర్హార్డ్ ఎరాస్మస్ అర్థ సెంచరీ చేయడంతో లక్ష్యఛేదన సులభం అయింది.
‘మాది చిన్న దేశం. క్రికెట్ ఆడేది కూడా తక్కువ మందే. దీనికి మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం’ అని కెప్టెన్ ఎరాస్మస్ అన్నాడు. గ్రూప్-ఏలో శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నమీబియా ఉండనుంది. దీంతో సూపర్ 12లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ ఉన్న గ్రూప్-2లో నమీబియా ఉండనుంది.
ఇక ఐర్లాండ్ కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ మ్యాచ్ ఓడిపోవడంపై పూర్తి నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఇది ఎంతగానో బాధ కలిగిస్తుంది. మేం ఎలాగైనా గెలవాలనుకున్నాం. కానీ స్కోర్‌బోర్డుపై తగినన్ని పరుగులు పెట్టలేకపోయాం’ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 శనివారం నుంచి ప్రారంభం కానుంది.
క్వాలిఫయర్ గ్రూప్-1 నుంచి శ్రీలంక, నమీబియా, క్వాలిఫయర్ గ్రూప్-2 నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ప్రధాన టోర్నీకి ఎంపికయ్యాయి.
సూపర్ 12 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి. అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్‌తో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 14వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది.
The fantastic four 🙌
— T20 World Cup (@T20WorldCup) October 22, 2021
Bangladesh, Sri Lanka, Scotland and Namibia - the teams which qualify from Round 1 into the Super 12 👏#T20WorldCup pic.twitter.com/gDeAd5PRYZ
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ