అన్వేషించండి

Yashasvi Jaiswal: ఒక్క మైలురాయితో రెండు రికార్డులు కొట్టిన యశస్వి - సచిన్ టెండూల్కర్ తర్వాత!

ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో పిన్న వయస్కుడైన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు.

Indian Premier League 2023: రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్ 16వ సీజన్‌లొ ఇప్పటివరకు చాలా రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి తన ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి యశస్వి జైస్వాల్ ఫామ్ కనిపించింది. జైస్వాల్ కూడా 18 బంతుల్లో 35 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ఐపీఎల్‌లో తన 1000 పరుగులు పూర్తి చేశాడు. యశస్వి జైస్వాల్ 21 సంవత్సరాల 130 రోజుల వయసులో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు.

ఈ సందర్భంలో అతను ఇప్పుడు పృథ్వీ షాను దాటేసి ఈ జాబితాలో చేరిన రెండో అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పేరు మొదటి స్థానంలో ఉంది. పంత్ 20 సంవత్సరాల 218 రోజుల వయసులో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలు రాయిని చేరుకోవడానికి పంత్‌కు 35 ఇన్నింగ్స్‌లు పట్టాయి

అత్యంత వేగంగా చేరిన ఆటగాళ్ల లిస్ట్‌లో కూడా...
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన మాజీ ఆటగాడు సురేశ్ రైనా కూడా ఐపీఎల్‌లో 34 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్‌లు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు 31 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 43.36 సగటుతో 477 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత యశస్వి జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు.

ముంబై - రాజస్తాన్ ల మధ్య జరిగిన వెయ్యో ఐపీఎల్ మ్యాచ్‌లో కూడాత జైస్వాల్ రెచ్చిపోయాడు. ముంబైతో  పోరులో 32 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసిన జైస్వాల్.. 53 బంతుల్లో సెంచరీ చేశాడు.  ఈ క్రమంలో ప్రత్యేకమైన మ్యాచ్ లో శతకం సాధించి ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది మొదటి శతకం. 

ముంబైపై సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్..  ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుల వారి జాబితాలో చేరాడు. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లలో  మనీష్ పాండే (19 ఏండ్ల 253 రోజులు)  ముందున్నాడు.  పాండే.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ పై సెంచరీ చేశాడు.  ఆ తర్వాత రిషభ్ పంత్ (20  ఏండ్ల 218 రోజులు -  2018లో సన్ రైజర్స్ పై), దేవదత్ పడిక్కల్ (20 ఏండ్ల 289 రోజులు - 2021లో రాజస్తాన్ పై)లు జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్  21 ఏండ్ల  123 రోజుల వయసులో  ముంబైపై సెంచరీ సాధించి  సంజూ శాంసన్ (22 ఏండ్ల 151  రోజులు- రైజింగ్ పూణె జెయింట్స్-2017లో) రికార్డును అధిగమించాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget